TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

సుశాంత్ బదులు సోనమ్ చావాల్సింది!

Jun 22, 2020 8:08PM

 

రీసెంట్‌గా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. సుశాంత్ సింగ్  రాజ్‌పుత్ సూసైడ్ తరవాత ట్విట్టర్‌లో నెగిటివ్ కామెంట్స్, రిప్లైలు ఎక్కువ కావడంతో నెగిటివిటీకి దూరంగా ఉండాలని ట్విట్టర్ అకౌంట్ తొలగిస్తున్నట్టు ఆమె తెలిపారు. సుశాంత్ ఆత్మహత్య తరవాత స్టార్ కిడ్స్, వారసులుగా ఇండస్ట్రీలో వచ్చిన హీరోలు, హీరోయిన్లపై విమర్శలు ఎక్కువయ్యాయి. నెటిజన్స్ ద్వేషానికి బలవుతున్నారు.

లేటెస్టుగా సోనమ్ కపూర్ సైతం తన సోషల్ మీడియా అకౌంట్స్ సహా తల్లితండ్రుల అకౌంట్స్ లో కామెంట్ సెక్షన్ డీయాక్టివేట్ చేస్తున్నట్టు తెలిపారు. ఎందుకిలా చేయాల్సి వస్తుందనేది ఆమె వివరించారు. తనకు ఎటువంటి మెసేజ్స్ వస్తున్నాయనేది స్క్రీన్ షాట్స్ తీసి చూపించారు. సోనమ్‌ను వేశ్యగా కామెంట్ చేసిన ఒకరు, సుశాంత్ బదులు ఆమె చావాల్సిందని తిట్టారు. సోనమ్‌కి ఎటువంటి టాలెంట్ లేదని, కేవలం ఆమె తండ్రి వల్ల అవకాశాలు అందుకుంటున్నదని ఆరోపించిన ఒకరు, ఆమెను రేప్ చేస్తానని కామెంట్ చేశారు. సుశాంత్ మరణానికి ఆమె కారణమని మరొకరు అన్నారు. సోనమ్ కి పుట్టబోయే పిల్లలు చచ్చిపోయాలని ఇంకొకరు శపించారు. 

కామెంట్ సెక్షన్ తొలగించినా... కొందరు డైరెక్టుగా సోనమ్ కి మెసేజ్స్ చేస్తున్నారు. ఎందుకు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారని ప్రశ్నిస్తున్నారు. 64 ఏళ్ల తన తండ్రి, తల్లికి ఈ గోల అనవసరమని, అందుకే ఆఫ్ చేశానని సోనమ్ తెలిపారు. ఎవరో భయపడి ఈ పని చేయలేదని, కామన్ సెన్స్ తో చేశానని ఆమె అన్నారు. 

google-ad-img