బుర్జ్ ఖలీఫా మీద ఒళ్లు జలదరింపచేస్తున్న మహేశ్ యాక్షన్!
on Feb 5, 2022

థమ్సప్ యాడ్‌లో మహేశ్‌బాబు ప్లేస్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రావడంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి చెందారు. థమ్సప్ యాడ్‌లో మహేశ్‌ని కాకుండా మరో స్టార్‌ని చూడాల్సి రావడం వారికి మింగుడు పడలేదు. అంతగా వారు దాన్ని పర్సనల్‌గా తీసుకున్నారు. కానీ వ్యాపార రంగంలో ఇది చాలా మామూలు విషయం అని ఆ స్టార్స్‌కూ, ఆ యాడ్స్ గురించి అవగాహన ఉన్న వాళ్లందరికీ తెలుసు.
అయితే తన ఫ్యాన్స్‌లోని అసంతృప్తిని తగ్గిస్తూ మౌంటెన్ డ్యూ యాడ్‌తో ప్రభంజనంలా దూసుకువచ్చాడు మహేశ్. కోలా బ్రాండ్స్‌లో ఒకటైన మౌంటెన్ డ్యూ పాపులారిటీ తక్కువేమీ కాదు. దానికి సంబంధించిన కంపెనీ రిలీజ్ చేసిన యాడ్‌లో మహేశ్ కనిపించిన విధానం ఫ్యాన్స్‌ను దిల్ ఖుష్ చేసింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో ఫుల్‌గా ట్రెండ్ అయ్యింది.
డేర్‌డెవిల్ బైకర్‌గా మహేశ్ స్టన్నింగ్ లుక్స్‌తో కనిపించాడు. ఆ యాడ్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (దుబాయ్)లో చిత్రీకరించారు. ఆ యాడ్‌లో మహేశ్ బుర్జ్ ఖలీఫా పై నుంచి కింద దాకా రైడ్ చేయడాన్ని ఒళ్లు జలదరించే రీతిలో తీశారు. ఒకవైపు రైడ్ చేస్తూ, మరోవైపు మహేశ్ చేసిన హై-వోల్టేజ్ యాక్షన్‌ను చూడ్డానికి రెండు కళ్లూ చాలట్లేదని సంబరపడి పోతున్నారు అభిమానులు.
మహేశ్‌తో తీసిన ఈ యాడ్‌తో మౌంటెన్ డ్యూ బ్రాండ్‌కు ఆదరణ మరింత పెరుగుతుందని కోలా కంపెనీ ఆశిస్తోంది. మహేశ్ క్రేజ్, ఇమేజ్, కరిష్మా కలిసి ఈ బ్రాండ్‌ను వేరే లెవల్‌కు తీసుకువెళ్తాయని చెప్పడానికి సంకోచించాల్సిన పని లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



