సందీప్, గౌతమ్ బాటలో రాహుల్ సాంకృత్యాన్!?
on Feb 7, 2022
.webp)
`టాక్సీవాలా`, `శ్యామ్ సింగ రాయ్` చిత్రాలతో తెలుగునాట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. త్వరలో యువ సామ్రాట్ నాగచైతన్య, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో రాహుల్ సినిమాలు చేసే అవకాశముందంటూ ప్రచారం జరుగుతోంది.
Also Read: సినిమాలకు గుడ్ బై.. రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం!
ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. అది కూడా.. `శ్యామ్ సింగ రాయ్` రీమేక్ వెర్షన్ కోసం. ఆ వివరాల్లోకి వెళితే.. ఆ మధ్య `అర్జున్ రెడ్డి` రీమేక్ `కబీర్ సింగ్`తో సెన్సేషనల్ హిట్ అందుకున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. త్వరలో `జెర్సీ` రీమేక్ తో వినోదాలు పంచనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. `శ్యామ్ సింగ రాయ్`ని కూడా హిందీలో రీమేక్ చేసేందుకు షాహిద్ ఆసక్తి చూపిస్తున్నారట. అంతేకాదు.. దీనికి దర్శకుడిగా రాహుల్ నే కొనసాగించే అవకాశముందంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read: 'సకల గుణాభి రామ'.. సన్నీకి సపోర్ట్ గా 'బిగ్ బాస్' ఆల్ కంటెస్టెంట్స్!
`అర్జున్ రెడ్డి` రీమేక్ ని మాతృక దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతోనూ.. `జెర్సీ` రీమేక్ ని ఒరిజనల్ వెర్షన్ కెప్టెన్ గౌతమ్ తిన్ననూరితోనూ చేసిన షాహిద్.. ఇప్పుడు `శ్యామ్ సింగ రాయ్`ని కూడా రాహుల్ తోనే చేయనుండడం విశేషమనే చెప్పాలి. `శ్యామ్ సింగ రాయ్` హిందీ రీమేక్ కార్యరూపం దాల్చితే గనుక.. సందీప్, గౌతమ్ తరహాలో రాహుల్ కూడా షాహిద్ కపూర్ సినిమాతోనే బాలీవుడ్ లో తొలి అడుగు వేయబోతున్నట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో!?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



