సికందర్ ఓటిటి డేట్ ఇదే..మరో రంజాన్ వచ్చినట్టే
on May 24, 2025
రంజాన్(Ramdan)పర్వదినాన్ని పురస్కరించుకొని అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)మార్చి 30 న' సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీపై, సల్మాన్ తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సల్మాన్ కెరీర్ లోనే అతి పెద్ద పరాజయాన్ని చవి చూసిందని చెప్పవచ్చు.
ఇక ఈ మూవీ ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు ఓటిటి ప్రేమికులు సికందర్ ఎప్పుడెప్పుడు ఓటిటి లోకి అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి అంటే రేపట్నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అభిమానులకి ఈ ప్రకటన శుభవార్త అని చెప్పవచ్చు.
సికందర్ లో సల్మాన్ సరసన రష్మిక(Rashmika Mandanna)జోడి కట్టగా, కాజల్ అగర్వాల్, సత్య రాజ్, షర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, సంజయ్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
