గబ్బర్ లో లేడి గబ్బర్ సింగ్
on Dec 18, 2013
"గబ్బర్ సింగ్" చిత్రంతో లక్కీ హీరోయిన్ గా మారిపోయిన శృతిహాసన్ ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న "గబ్బర్" సినిమాలో శృతిని ఎంపిక చేసినట్లుగా తెలిసింది. అయితే ముందుగా ఈ సినిమాలో శ్రద్దాకపూర్ ను ఎంపిక చేసుకున్నప్పటికీ, తర్వాత ఫైనల్ గా శృతిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. తెలుగులో చిరంజీవి నటించిన "ఠాగూర్"ని హిందీలో "గబ్బర్" పేరుతో రీమేక్ చేస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. జనవరి 8 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం శృతి తెలుగులో నటించిన "ఎవడు" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా అల్లు అర్జున్ తో "రేసుగుర్రం" షూటింగ్ లో బిజీగా ఉంది.