Home

»

Latest News

Shriya Saran: ఎందుకు ఆ ప్రశ్న వేశారు.. యాంకర్ కి శ్రియా సూపర్ రిప్లై 

Apr 27, 2026

 

స్టిల్ ఈ నిమిషం సినిమాలకి గుడ్ బై చెప్పినా సరే సౌత్ సినీ పరిశ్రమ తన మనుగడ సాగిస్తున్నంత కాలం శ్రియా(Shriya Saran)పేరుని మరవడం అనేది జరగని పని. అంత చరిష్మా శ్రీయ సొంతం. సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఉండదు డ్యూడ్ అంటూ మిరాయ్ లో అంబికా ప్రజాపతిగా తన నటన తాలూకు విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రీసెంట్ గా తన ఏజ్ కి సంబంధించిన విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యాఖ్యలు ఘాటైనవి కావడంతో సోషల్ మీడియాలో శ్రేయ తాలూకు సువాసనలు ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మ్యాటర్ పై ఒక లుక్ వేద్దాం. 

ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీయ తో యాంకర్ మాట్లాడుతూ 43 ఏళ్ళ వయసులో గ్లామర్ ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారనే ప్రశ్న అడగడం జరిగింది. అందుకు శ్రీయ మాట్లాడుతూ మీరు ఈ ప్రశ్న వేయడమే తప్పు, వయసుతో పని ఏముంది. ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు దాటినా లేదా పెళ్లైనా వారి కెరీర్ ముగిసినట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇండస్ట్రీలో ఏజ్ అనేది ఇప్పుడు ఒక అడ్డంకి కాదు. నటీనటుల ప్రతిభకి, వారు ఎంచుకునే పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది. 40 ఏళ్లలో కూడా అద్భుతమైన పాత్రలు చేసే అవకాశం మాకు దక్కుతోంది. ప్రేక్షకులు కూడా నటి వయస్సు కంటే ఆమె పర్ఫార్మెన్స్‌ను చూసి ఆదరిస్తున్నారు" అని శ్రియా ఆనందం వ్యక్తం చేశారు.


also read: Peddi: పెద్దికి శృతి హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా!


నటిగా ఎప్పుడూ సిద్ధంగా ఉండటం నా బాధ్యత. క్రమం తప్పకుండా యోగా, డాన్స్ మరియు సరైన ఆహారపు అలవాట్లు పాటించడం వల్లే ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాను. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనం మరింత పరిణితి చెందుతాం. అది మన నటనలో కూడా కనిపిస్తుంది. అందుకే ఈ దశలో మరింత వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com