TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

పవర్‌ఫుల్‌గా కన్నడ సూపర్ స్టార్ శివన్న 'వేద' ఫస్ట్ లుక్!

Jan 23, 2023 12:11PM

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రం 'వేద'. ఇది శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమాతో ఆయన 125 చిత్రాల మైలురాయిని అందుకున్నారు. అంతేకాకుండా, ఆయన భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం.

ఇటీవల కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం. 

ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

google-ad-img