పోలీస్‌గా శర్వానంద్?
on Jul 2, 2020
శర్వానంద్ ఓ సినిమాలో పోలీస్‌గా కనిపించాడు. అది 'రాధ'లో! అయితే, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు మరోసారి ఖాకీ చొక్కా వేసుకుని వెండితెరపై సందడి చేయడానికి శర్వా రెడీ అవుతున్నాడని టాక్. ఈసారి ఘన విజయం దక్కాలని ఆశిద్దాం.
ప్రస్తుతం పల్లెటూరి నేపథ్యంలో వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ తెరకెక్కుతున్న 'శ్రీకారం' సినిమాలో శర్వానంద్ నటిస్తున్నాడు. దీని తరవాత యువి క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఆ సినిమాలో శర్వానంద్ పోలీస్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇతర కాస్ట్ అండ్ క్రూ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదట. 'శ్రీకారం' సినిమా పూర్తయిన తరవాత ఈ సినిమా ప్రారంభిస్తారట.
యువి క్రియేషన్స్‌లో 'రన్ రాజా రన్' హిట్ తరవాత శర్వానంద్ చేస్తున్న చిత్రమిది. యువి నిర్మాతలతో హీరోకి మంచి అనుబంధం ఉంది. అందుకని, కథ నచ్చడంతో వెంటనే సినిమాకి ఓకే చెప్పారట.