Home

»

Latest News

ఇంతకీ నాగశౌర్య మేనత్త ఎవరో తెలుసా!

Feb 04, 2023

నిన్నటి తరం ప్రేక్షకులకి లత శ్రీ అనే పేరు గుర్తుండే ఉంటుంది. యమలీల చిత్రంలో అభివందనం య‌మరాజా అనే పాటలో ఆమె అలరించింది. ఆ ఒక్కటి అడక్కు లో రాజేంద్రప్రసాద్ చెల్లెలి పాత్రను చేసింది. నెంబర్ వన్, జంబలకడిపంబ వంటి ఎన్నో చిత్రాలు నటించింది. ఎక్కువ‌గా హీరోల చెల్లెలి పాత్ర‌ల్లో న‌టించేది.  దక్షిణాదిలో దాదాపు 70 సినిమాల్లో నటించింది. జిమ్ ట్రైనర్ ని  ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2007లో ఇవివి తీసిన అత్తిలి సత్తిబాబు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ల‌త‌శ్రీ  ఫ్యామిలీకి నాగశౌర్య ఫ్యామిలీకి మధ్య మాటలు లేవట. ల‌త‌శ్రీ మేనల్లుడే నాగశౌర్య. స్వయానా నాగశౌర్య తండ్రికి ల‌త‌శ్రీ  చెల్లెలు. ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు తన మేనల్లుడు నాగశౌర్య అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. ఆయన సినిమాలన్నీ చూస్తుందట. ప్రస్తుతం నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, పోలీసువారి హెచ్చరిక వంటి సినిమాలు చేస్తున్నారు, ఇటీవల ఆయన వివాహం చేసుకున్నారు, బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి వివాహం చేసుకున్నారు. కొద్దిమంది అతిధుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లికి కూడా ల‌తాశ్రీ రాలేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com