బోయపాటి క్రియేటివిటీపై సెటైర్...
on Sep 16, 2019
రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' ఫలితాన్ని పక్కనపెట్టి ముందుకు కదిలాడు. హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్' చేస్తున్నాడు. నిర్మాతగా అక్టోబర్ 2న విడుదల కానున్న 'సైరా నరసింహారెడ్డి' పనుల్లో తలమునకలై ఉన్నాడు. దర్శకుడు బోయపాటి కూడా 'వినయ విధేయ రామ'ను మర్చిపోయేలా బాలకృష్ణతో చేయనున్న సినిమా కథపై దృష్టి పెట్టాడు. ప్రేక్షకులూ దాదాపు ఆ సినిమాను మర్చిపోయినట్టే. ఇటువంటి సమయంలో 'వినయ విధేయ రామ'ను, అందులో ప్రేక్షకులు హేళన చేసిన ఓ సన్నివేశాన్ని 'తెనాలి రామకృష్ణ' టీజర్ మళ్లీ గుర్తు చేసింది. 'వినయ విధేయ రామ'లో విలన్ వివేక్ ఒబెరాయ్ మనుషుల తలలను రామ్ చరణ్ నరకడం, గాల్లోకి లేచిన ఆ తలలను గద్దలు ఎత్తుకు వెళ్లడం తెలిసిందే. ఆ సన్నివేశంపై అప్పట్లో సోషల్ మీడియాలో సెటైర్స్ పడ్డాయి. కామెడీగా ఉందని కొందరు కామెంట్ చేశారు. 'తెనాలి రామకృష్ణ' టీజర్లోనూ దాన్ని కామెడీ చేశారు. 'వాడి తల ఎగరాల్సిందే.. గద్దలు ఎత్తుకెళ్లాల్సిందే' అని కమెడియన్ సప్తగిరి చేత ఓ డైలాగ్ చెప్పించారు. సినిమా జయాపజలకు ఎవరైనా సమిష్టి బాధ్యత తీసుకోవాలి. కానీ, సినిమా క్రియేటివిటీ దర్శకుడిది చెందుతుంది. ఈ డైలాగ్ బోయపాటి క్రియేటివిటీపై సెటైర్ అనుకోవాలేమో. దీనిపై 'తెనాలి రామకృష్ణ' హీరోలు ఏమంటారో?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
