Home

»

Latest News

Sathileelavathi Trailer: 'సతీ లీలావతి' ట్రైలర్.. భర్త లవ్ స్టోరీ తెలిసి చుక్కలు చూపించిన భార్య!

May 02, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేతుల మీదుగా విడుదలైన 'సతీ లీలావతి' (Sathileelavathi) మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. (Sathileelavathi Trailer)

ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు ఎంతో సరదాగా సాగింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సంఘటనలు, భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి మనస్పర్థలను దర్శకుడు ఎంతో హాస్యభరితంగా మలిచినట్లు కనిపిస్తోంది. టైటిల్ వినగానే పాత కాలపు సినిమా అనిపించినా, ఇందులో నేటి తరం జంటల ఆలోచనలు, వారి మధ్య ఉండే కెమిస్ట్రీని చాలా ఫ్రెష్‌గా చూపించారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, దేవ్ మోహన్ తన లుక్స్‌తో మెప్పించాడు.

ట్రైలర్ లో మొదట సాఫ్ట్ గా కనిపించిన లావణ్య, ఆ తర్వాత గయ్యాళిలా ప్రవర్తించడం భలే ఉంది. పెళ్ళికి ముందు భర్తకు ఉన్న లవ్ స్టోరీ గురించి ఆమె తెలుసుకోవడం, అతన్ని కట్టేసి హింసించడం వంటి సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. అలాగే భార్య నుంచి తప్పించుకోవడానికి భర్త పడే పాట్లు నవ్వులు పూయించాయి. ఇక ట్రైలర్ చివరిలో "నువ్వు నన్ను ఏం చేయలేవు రా" అంటూ లావణ్య అరుంధతిలా మారి విశ్వరూపం చూపించడం హైలైట్ గా నిలిచింది. 

ఈ సినిమా ట్రైలర్‌ను రామ్ చరణ్ లాంచ్ చేయడం చిత్ర యూనిట్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ఫన్, ఎమోషన్స్, బ్యూటిఫుల్ విజువల్స్ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మొత్తానికి 'సతీ లీలావతి' ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. వేసవి సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా కోసం చూస్తున్న వారికి ఇదొక మంచి ఆప్షన్ కానుంది. మే 8న థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com