ఆమె ఏం చేసినా పిల్లి స్థంబాన్ని గీరడం లాంటిది.. ఈ హీరోయిన్ ని ఉద్దేశించేనా!
on May 27, 2025
'యానిమల్'(Animal)హిట్ తో 'సందీప్ రెడ్డి వంగ'(Sandeep Reddy Vanga)ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)తో 'స్పిరిట్'(Spirit)ని స్టార్ట్ చేసేటందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రభాస్, సందీప్ రెడ్డి కెరీర్లోనే హై బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో తొలుత హీరోయిన్ గా దీపికా పదుకునే(Deepika Padukune)ని సందీప్ రెడ్డి వంగ ఫిక్స్ చేసాడు. ఈ మేరకు ఆమెకి 'స్పిరిట్' స్టోరీని చెప్పడంతో పాటు, ఆమెకి సంబంధించిన కొన్ని సీన్స్ ని ప్రాక్టీకల్ గా షూట్ చేసాడనే వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ప్రాజెక్టు పట్ల దీపిక పెట్టే కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెని తొలగించి, యానిమల్ ఫేమ్ 'త్రిప్తి డిమ్రీ'(Tripti Dimri)ని తీసుకున్నాడు. ఇది జరిగాక బాలీవుడ్ లోని కొన్ని మీడియా ఛానెల్స్ తో పాటు, దీపిక కి చెందిన పీఆర్ టీం సందీప్ పై రివేంజ్ తీసుకోవడం స్టార్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా స్పిరిట్ ' A ' కేటగిరి మూవీ. త్రిప్తి డిమ్రీ లాంటి బోల్డ్ హీరోయిన్ ని తీసుకున్నారంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. స్పిరిట్ స్టోరీ ని దీపికా లీక్ చేసింది. తనపై షూట్ చేసిన సీన్స్ ని సైతం బయటికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు వీటిపై దీపికా పేరు ప్రస్తావించకుండా సందీప్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తు, నేను ఓ నటికి స్టోరీ చెప్పినప్పుడు, ఆమెపై వంద శాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఆమె సినిమాకి సంబంధించిన విషయాలని బయటకి ఎలా చెప్తుంది. ఒక యంగ్ నటిని కూడా కించపరుచుతున్నారు. ఇదేనా మీ ఫెమినిజం. ఫిల్మ్ మేకర్ గా సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడుతుంటాను. సినిమానే నాకు ప్రపంచం. మీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. ఈ సారి స్టోరీ మొత్తం లీక్ చెయ్యండి. మీరేం చేసినా నాకు ఫరక్ పడదు. పిల్లి స్థంబాన్ని గీరడం లాంటిదని ట్వీట్ వేశాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
