
కళాకారులు దేశాలని ఏలతారని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పినట్టుగా అచ్చు గుద్దినట్టుగా జరుగుతు ఉంది. ఆ కారణ జన్ముడి మాటలని నిజం చేస్తు రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(VIjay)తమిళనాడు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాడు. దీంతో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా విజయ్ మా సినిమా వాడు అంటు పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందులో బిగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఒకడు. మరి ఏం చెప్పాడో చూద్దాం.
ఎక్స్ వేదికగా విజయ్ గెలుపుపై స్పందిస్తు సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. ఒక బలమైన ఆయుధం. నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారి వెనుక ఉండే లక్షలాది మంది అభిమానుల బలం, దేశ భవిష్యత్తుని మార్చగలదు. నటులు కూడా కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి రావడం గొప్ప పరిణామం. ముఖ్యంగా దక్షిణాదిలో ఎన్టీఆర్, ఎంజీఆర్ కాలం నుండి సినిమా స్టార్లు రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేశారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. దీంతో సినిమాకి ఉన్న శక్తి కూడా ఏ పాటిదో మరో సారి తెలిసిందని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రికార్డ్స్ లైక్స్ తో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది.
Also read: Trisha: త్రిషకి అదిరిపోయే గిఫ్ట్ పంపించిన మంచు లక్ష్మి.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
సందీప్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో (స్పిరిట్) చేస్తున్న విషయం తెలిసిందే.






