Home

»

Latest News

సంయుక్త మీనన్ బర్త్‌డే గిఫ్ట్.. యోధురాలిగా మెరిసిన గ్లామర్ బ్యూటీ!

Sep 11, 2026 9:58PM

టాలీవుడ్ లక్కీ చార్మ్, మోస్ట్ హాపెనింగ్ బ్యూటీ సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే రాజ్ పుట్ ట్రీట్ లభించింది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ 'స్వయంభూ' చిత్ర బృందం సంయుక్తకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పవర్ ఫుల్ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

విడుదలైన దాదాపు 40 సెకన్ల ఈ ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో సంయుక్త 'భూమి' అనే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. చేతిలో పదునైన కత్తి పట్టి, శత్రు సమూహంపైకి దూసుకెళ్లే వీరనారిగా ఆమె చూపించిన రౌద్ర రసం, పోరాట పటిమ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ మరియు ఎమోషనల్ రోల్స్‌లో మెరిసిన సంయుక్త, ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం పూర్తిగా రూపురేఖలు మార్చుకున్నారు. ఈ యోధురాలి పాత్రలో అత్యంత సహజంగా ఒదిగిపోవడం కోసం ఆమె ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, సమర విద్యలు మరియు కత్తిసాములో శిక్షణ పొందడం విశేషం. ఆమె కెరీర్‌లోనే ఇది అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రగా నిలవనుంది.

'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' వంటి వరుస హ్యాట్రిక్ హిట్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సంయుక్త, 'స్వయంభూ' చిత్రంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నారు. వరుస సక్సెస్ లతో ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఈ చిత్రంలో తన మార్క్ నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో సంయుక్తతో పాటు గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ మరొక ముఖ్య పాత్రలో అలరించనుంది. నిఖిల్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని కష్టపడుతున్నారు.

ప్రస్తుతం నెట్టింట ఈ బర్త్‌డే వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. సంయుక్త యుద్ద రంగాన సాగించిన యాక్షన్ సీన్స్ చూసిన సినీ ప్రియులు, నెటిజన్లు ఆమె మేక్ ఓవర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ అధికారిక విడుదల తేదీని త్వరలోనే చిత్ర యూనిట్ ప్రక ప్రకటించనుంది.

 

 

 

[Samyuktha Menon Birthday Special Video, Swayambhu Telugu Movie Update, Nikhil Siddhartha Swayambhu Glimpse, Samyuktha Menon Warrior Look, Swayambhu Movie Cast]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com