TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకుంది అందుకే: భోగి డైరెక్టర్ సంపత్ నంది!

Nov 25, 2026 4:01PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ ప్లాప్ తర్వాత ఎంతో మంది అగ్ర దర్శకుల కథలు విని కూడా ఓకే చేయకుండా వరుణ్ సందేశ్ తో 'ఏమైంది ఈ వేళ' అని చిన్న సినిమాకి దర్శకత్వం వహించిన సంపత్ నంది కి అవకాశం ఇచ్చాడంటే సంపత్ క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. బేసిక్ గా రైటర్ అయిన సంపత్ ఎల్లుండి శర్వానంద్ తో 'భోగి' అంటు వస్తున్నాడు. 


 పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా.. చివరకు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు సంపత్ నంది. అప్పట్లో దీనిపై రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు అసలు విషయం బయటపెట్టారు సంపత్ నంది. ‘భోగి’ ప్రమోషన్లలో భాగంగా పవన్‌తో సినిమా ఎందుకు చేయలేకపోయారో వెల్లడించారు.

పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని అనుకున్నామని, కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్ పదేపదే ఆలస్యమైందని సంపత్ నంది తెలిపారు. ఒక సందర్భంలో పవన్ తనను మరికొంత కాలం వేచి ఉండగలవా అని అడిగారని చెప్పారు.దానికి తాను ఈలోగా మరో సినిమా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదా అని అడిగినట్లు వెల్లడించారు. అలా ఎలాంటి వివాదాలు లేకుండానే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా సంపత్ నంది వెల్లడించారు. తాను పవన్ కల్యాణ్‌తో చేయాల్సిన సినిమా వేరే ప్రాజెక్ట్ కాదని, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమానే అని స్పష్టం చేశారు. అప్పట్లో ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం జరిగినప్పటికీ, తాను డైరెక్ట్ చేయాల్సిన కథ రీమేక్ కాదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆస్కార్ బరిలో రామాయణ స్పీడ్: టాప్ 20 లో చోటు..కాకపోతే ఆ బలమైన చిత్రాలు కూడా పోటీలో! 

ఆ తర్వాత నిర్మాతల ద్వారా పవన్ కల్యాణ్ తనతో సినిమా చేయడానికి ఎంతో ప్రయత్నించారని తెలిసిందని సంపత్ నంది చెప్పారు. తమ ఇద్దరి ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఎవరినీ ఎక్కువకాలం వేచి ఉండేలా చేయడం పవన్‌కు ఇష్టం ఉండదని పేర్కొన్నారు.

మొత్తానికి ఇన్నాళ్లుగా ఆసక్తిగా మారిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నుంచి సంపత్ నంది ఎందుకు తప్పుకున్నారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. మరి భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందేమో చూడాలి. 

 

మీకు నచ్చవచ్చు

మాధురి దీక్షిత్ అందం రహస్యం ఇదే: వాడితే మీరు కూడా అలా!

ఇది ఎన్టీఆర్ క్రేజ్ అంటే: ఎవరు సాటి రారు!

 

 

[Pawan Kalyan, Sampath Nandi,  Sardaar Gabbar Singh, Bhogi, Tollywood]

 

google-ad-img