నితిన్ కు బుక్కయిన సమంత
on Sep 21, 2013
సమంత నటించిన తాజా చిత్రాలు "అత్తారింటికి దారేది", "రామయ్యా వస్తావయ్యా" విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే మరో రెండు, మూడు సంవత్సరాలవరకు కూడా సమంత టాప్ హీరోయిన్ గా బిజీ అయిపోయినట్లే. మరి ఈ రెండు చిత్రాలు సమంతకు ఎలాంటి బ్రేక్ ను ఇస్తాయో మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఇవే కాకుండా సమంతా ప్రస్తుతం "మనం", "రభస" చిత్రాలతో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా నితిన్ హీరోగా ఏ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం "కొరియర్ బాయ్ కల్యాణ్", "హార్ట్ఎటాక్" చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు నితిన్. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.