Home

»

Latest News

కొత్త అధ్యాయం: నా జీవితం పూర్తిగా మారబోతోంది.. సమంత ఎమోషనల్ కామెంట్స్.!

Sep 9, 2026 3:35PM

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై సందడి చేశారు. ఆ కవర్ పేజీపై రాయల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే.. తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయం గురించి ఆమె పంచుకున్న మాటలు ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతున్నాయి.

సమంత ప్రస్తుతం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన, ఎమోషనల్ ఫేజ్‌లోకి అడుగుపెడుతున్నారు. త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సమంత, జీవితాన్ని ఒక కొత్త కోణంలో, ఆశతో చూడటం ప్రారంభించారు. 

తాజాగా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన సమంత.. "I’m ready for my life to change completely" అంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఒక తల్లిగా, ఒక వ్యక్తిగా ఆమెలో రాబోతున్న ఆ కొత్త అనుభూతి, కొత్త అనుభవం ఆమె జీవితాన్ని ఎలా మార్చబోతోందో ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

జీవితంలో ఎన్ని మార్పులు, సవాళ్లు ఎదురైనా ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడే సమంత, ఇప్పుడు రాబోయే భవిష్యత్తును పూర్తి ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తున్నారు. ఈ మాతృత్వ ప్రయాణం కేవలం ఒక కొత్త బాధ్యత మాత్రమే కాదు, తనని తాను ఒక కొత్త కోణంలో అర్థం చేసుకునేందుకు సహాయపడుతోందని ఆమె భావిస్తున్నారు.

ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో మరిన్ని ఆసక్తికరమైన పిక్స్ కూడా షేర్ చేశారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌ను విజిట్ చేసిన సమంత, అక్కడ ప్రశాంతమైన క్షణాలను గడిపారు. ఆ ప్రదేశంతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, లింగ బైరవి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, గోవులతో గడపడం, అక్కడే భోజనం చేయడం, సద్గురును కలవడం వంటి పిక్స్‌ను షేర్ చేశారు.

తన వ్యక్తిగత జీవితంలో ఎంతటి ఒడిదుడుకులు ఎదురైనా, ప్రతిసారి అంతకంటే బలంగా తిరిగి కోలుకుని నిలబడ్డ సమంత, ఇప్పుడు తన జీవితంలో రాబోయే ఈ పాజిటివ్ మార్పులను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీ ఫోటోలు, సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

 

 

 

[Samantha Ruth Prabhu, The Hollywood Reporter India, Samantha, Magazine Cover, Bangaaram, Sadhguru, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com