Home

»

Latest News

బొద్దింకలని చంపడం కూడా సల్మాన్ కి తెలియదంట

Oct 19, 2024 4:05PM

సల్మాన్ ఖాన్(salman khan)చంపుతామని జైలులో ఉన్న గ్యాంగ్ స్టార్  లారెన్స్ బిష్ణోయ్(lawrece bishnoi)బెదిరించిన విషయం తెలిసిందే. దీని వెనుక  గతంలో కృష్ణ జింక ని సల్మాన్ చంపి తినడమనే కారణాలు వినిపిస్తున్నాయి.ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గాని సల్మాన్ ని బిష్ణోయ్  ప్రధానంగా టార్గెట్ చేయడం వెనుక కృష్ణ జింక అనే మాట అయితే వినపడుతుంది. కృష్ణ జింక ని చంపి తిన్నందుకు సల్మాన్ క్షమాపణలు చెప్పాలని కూడా బొష్ణోయ్  తో పాటు అతని గ్యాంగ్ డిమాండ్ చేస్తుంది.

ఈ విషయం పై రీసెంట్ గా సల్మాన్ తండ్రి సలీం ఖాన్(salim khan)మాట్లాడుతూ సల్మాన్ నాతో ఎప్పుడు అబద్దం చెప్పడు.మూగజీవాలని వెంటాడటం తనకి ఇష్టం ఉండదు.జంతువులని ఎంతగానో ప్రేమిస్తాడు.క్షమాపణలు చెప్తే తప్పు చేసినట్టు అంగీకరించినట్టే కదా,భొద్దింకలని చంపడం కూడా తనకి తెలియదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. సల్మాన్ కి రక్షణగా దుబాయ్ నుంచి బులెట్ ప్రూఫ్ కారు వస్తుందన్నవార్తలు వినిపిస్తున్నాయి.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com