
‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు, దర్శకుడు యుగంధర్ ముని కలిసి ‘కరికాల’ అంటూ మరో విజువల్ వండర్‌ను క్రియేట్ చేయబోతోన్నారు. సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
‘కరికాల’ మొదటి చాప్టర్ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి.
రీసెంటుగా ఈ చిత్రం సందీప్ కిషన్‌కి జోడిగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ నటించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా మరో హీరోయిన్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ కూడా హీరోయిన్‌గా నటించబోతోన్నట్టుగా తెలిపారు. ఈ మేరకు వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో 'కరికాల' పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోంది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరగబోతోన్నాయి.
ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి నయనతార.. విజయ్ బాటలో లేడీ సూపర్‌స్టార్.?

[Sakkshi Mhadolkar Joins Karikaala, Karikaala Movie, Sundeep Kishan, Ugandhar Muni, Sakkshi Mhadolkar, Shambhala Movie, Telugu Cinema, Telugu Film News]





