సైఫ్ కూతురు సినీరంగ ప్రవేశం
on Nov 25, 2013
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కు ఇటీవలే కరీనాకపూర్ తో వివాహం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. అయితే త్వరలోనే కరీనా కూతురు హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నదని సమాచారం. ఏంటి కరీనాకు అసలు ఇంకా పిల్లలే పుట్టలేరు కదా. మరి ఆమె కూతురు హీరోయిన్ అవడమేంటి అని అనుకుంటున్నారా? అసలు విషయమేమిటంటే... సైఫ్ మొదటి భార్య అమ్రిత్ తో 2004 లో విడాకులు అయిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కూతురు సారా. సైఫ్ కి కూతురు అంటే కరీనాకు కూడా కూతురే అవుతుంది కదా. కాబట్టి సారా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయడానికి సిద్దంగా ఉందని తెలిసింది. సారా ఎంట్రీపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ చెప్తున్నాడు.