Home

»

Latest News

Sai Dharam Tej: స్కూల్ లో ఏకంగా టీచర్‌కే లైన్ వేశా.. మెగా హీరో మామూలోడు కాదు!

Apr 25, 2026

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తనదైన హ్యూమర్‌తో స్టేజ్‌పై సందడి చేశారు. మలయాళ సూపర్ హిట్ 'వాలా 2' (Vaazha 2) ఇటీవల తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్, యాంకర్ స్రవంతిపై చేసిన హిలేరియస్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టీచర్‌కే లైన్ వేశాం.. తేజ్ నవ్వులు!
ఈ వేడుకలో యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. "మీరు స్కూల్ డేస్‌లో ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా లైన్ వేశారా?" అని సాయి ధరమ్ తేజ్‌ను ప్రశ్నించింది. దానికి తేజ్ ఏమాత్రం తడుముకోకుండా చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. "అమ్మో.. మేం స్కూల్ లో ఉన్నప్పుడు ఏకంగా టీచర్‌కే లైన్ వేశాం" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తేజ్ సమాధానానికి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. స్రవంతి కూడా తేజ్ టైమింగ్‌కు షాక్ అవుతూనే, తను కూడా గట్టిగా నవ్వేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ తన స్పాంటేనియస్ ఆన్సర్లతో ఎప్పుడూ ఆడియన్స్‌ను అలరిస్తుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com