Home

»

Latest News

పిడిగుద్దులుతో చితకబాదిన సాయి ధన్సిక.. మందు తాగి అతి చేస్తే ఇలాగే ఉంటది  

Feb 9, 2026 2:30PM

 


-విశాల్, సాయి ధన్సిక పెళ్లి ఎప్పుడు!
-చితకబాదాల్సిన  అవసరం ఏముంది!
-ఆల్కహాల్ తాగితే ఇలాగే ఉంటుంది.
-తను చేసింది కరెక్టే నా  


గత ఏడాది అగస్ట్ 29 వ తేదీన విశాల్(Vishal),సాయి ధన్సిక(Sai Dhanshika)ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి మాత్రం తమిళ మూవీ ఆర్టిస్ట్ సంక్షేమ కోసం కడుతున్న నడిగర్ సంఘం బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక జరగబోతుంది. విశాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి సాయి  ధన్సిక  కూడా  సపోర్ట్. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమన్నాతో కలిసి విశాల్ చేస్తున్న 'మొగుడు' మూవీ శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటూ త్వరలోనే థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది. సాయి ధన్సిక ఆల్రెడీ మొన్న ఆరవ తారీఖున 'యోగి డా(Yogi da)’తో థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ఆమె నే లీడ్ రోల్ కావడం గమనార్హం.

 

 

రీసెంట్ గా యోగి డా ప్రమోషన్స్ సందర్భంగా  ఇచ్చిన ప్రమోషన్స్ లో సాయి ధన్సిక మాట్లాడుతు 'కేరళలో సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నా అంకుల్‌ వద్దకి  ఒక వ్యక్తి  వచ్చి ఫోటో దిగుతానని అడిగాడు. కానీ ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో అంకుల్‌  నిరాకరించారు. దాంతో సదరు ఆ వ్యక్తి కోపంతో అంకుల్ ని కొట్టి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నా వాళ్లని ఎవరేమైనా అంటే ఊరుకోను. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ క్షణంలో ఆలోచించకుండా అతడిని వెంబడించి పట్టుకుని చితకబాదాను. నాకు మార్షల్‌ ఆర్ట్స్‌లో పరిచయం ఉండటంతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశానని, దర్శకుడు, హీరో వచ్చి ఆపేందుకు ప్రయత్నించినా  శాంతించలేదు. సుమారు 10 నిమిషాల పాటు అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూనే ఉన్నాను. నా ప్రవర్తన చూసి సెట్లోని వారంతా షాకయ్యారని తెలిపింది.

 

also read:  ఫౌజీ క్రేజ్ పవన్ కి తప్పదా!.. ఇదంతా ఆ హీరోయిన్ వల్లనే!


ఆమె అంకుల్ పేరుని మాత్రం ధన్సిక ప్రస్తావించలేదు. యోగి డా లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించి మరోసారి తన నటనా సామర్థ్యాన్ని చాటింది. గౌతమ్‌ కృష్ణ(Goutham Krishna) దర్శకత్వం వహించగా,సెంథిల్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించాడు. 'షికారు' మూవీతో తెలుగులోకి కూడా ధన్సిక ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 


   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com