ఎక్కడున్నారు ఓటిటి లవర్స్: పక్కా రొమాంటిక్ థ్రిల్లర్ మీ కోసమే అందులో ఉంది!
Nov 27, 2026 2:25PM

ప్రెజెంట్ ఓటిటి సినీ ప్రేమికులందరు, మరి ముఖ్యంగా రొమాంటిక్ జోనర్స్ ని ఇష్టపడే వాళ్లంతా, ఒక టీంలాగా ఏర్పడి 'సాయవనం' గురించి ఎవరకి చెప్పద్దు. చెప్తే మనం పొందే ఆ ఆనందం వాళ్ళు కూడా పొందుతారని అనుకుంటున్నారు. ఎందుకంటే పక్కా రొమాంటిక్ డ్రామా.కానీ మేము అలా కాదు మీ కోసం సాయవనం గురించి డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాం. ఈ రోజే సిద్ధం కండి.
కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా సందడి చేయవు. కానీ ఓటీటీలోకి వచ్చాక మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా కొత్త తరహా కథలు, సస్పెన్స్, ఊహించని మలుపులతో సాగే థ్రిల్లర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అలాంటి సినిమానే 'సాయవనం'. కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఈ తమిళ థ్రిల్లర్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అడవిలో జరిగే కథ.. ఆసక్తికరమైన మలుపులు!
'సాయవనం' కథ విషయానికి వస్తే.. దట్టమైన అడవి నేపథ్యంలో సాగుతుంది. సీత అనే మహిళ తన కుటుంబం, సంప్రదాయాలు, సామాజిక విలువలను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటుంది. కానీ అనుకోకుండా ఆమె జీవితంలోకి కొన్ని సమస్యలు వచ్చి పడతాయి.

సీత భర్త ముత్తు ఓ రోజు లారీ కొనుగోలు చేయడానికి వెళ్లి కనిపించకుండా పోతాడు. దీంతో ఆమె ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ సమయంలో సురుళి అనే వ్యక్తి ఆమె జీవితంలోకి వస్తాడు. కొంతకాలానికి ముత్తు తిరిగి రావడంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సీత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? తన ఆత్మగౌరవం కోసం ఆమె ఎలాంటి పోరాటం చేసింది? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
ఇది కూడా చదవండి: సినిమాలో ఫోన్ నంబర్ చూపించారు:నిజ జీవితంలో వేధింపులు..ఇప్పుడు పోలీస్ కేసు!
నటీనటులు, సాంకేతిక బృందం
ఈ సినిమాలో సీత పాత్రలో దేవనంద షాజిలాల్ నటించగా.. ముత్తు పాత్రలో సౌందర రాజా కనిపించారు. సురుళి పాత్రలో సంతోష్ దామోదరన్ నటించారు. వీరితో పాటు అప్పుకుట్టి, జానకి జయరామన్, వెట్రివేల్ రాజా, మాథ్యూ మాంప్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డామర్ సినిమా బ్యానర్‌పై సంతోష్ దామోదరన్ నిర్మించగా.. పాలీ వర్గీస్ సంగీతం అందించారు.
.webp)
ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్
గతంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్లు, సర్వైవల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. మొత్తానికి కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన 'సాయవనం' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. రొమాంటిక్ థ్రిల్లర్ కాబట్టి మీరు మిస్ కారని తెలుసు!
మీకు నచ్చవచ్చు
షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్: మరో రామాయణ తీస్తారా!
ప్రేమంటే అర్ధం తెలుసా మీకు: వామ్మో ఈ హీరోయిన్ మాత్రం భలే అర్ధం చెప్పింది!
[saayavanam, Devananda Shajilal, Soundara Raja, Aha, Kollywood]



