
-వైరల్ మారిన రోజా కూతురు పెళ్లి న్యూస్
-ఎవరు ఆ స్టార్ హీరో
-రోజా స్పీచ్ ఏంటి!
తెలుగు సినిమా, రోజా(Roja)కి మధ్య ఉన్న అనుబంధానికి సుదీర్ఘమైన హిస్టరీ నే ఉంది. దాదాపుగా అందరి అగ్ర హీరోలతోను జత కట్టి తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకోగా, ఆమె నోటి నుంచి వచ్చిన చాలా సినిమా డైలాగ్స్ ఫుల్ ఫేమస్. బుల్లితెర ప్రేక్షకులని కూడా అలరిస్తూ వస్తున్న రోజా కూతురు పెళ్లికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెష్ గా చక్కర్లు కొడుతుంది. మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
రోజా కూతురు పేరు అన్షు మాలిక(Anshu Malika)ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసిస్తుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అన్షు మాలిక ఓ స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. త్వరలోనే పెళ్లి అని కూడా అంటున్నారు. రూమర్ హోదాలోనే చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ గతంలో కూడా తన రూమర్ కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించింది. ఆ టైంలో రోజా మాట్లాడుతు నా కూతురు పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పైగా స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందట అని అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో నాకు కూడా చెప్పండి. అలాంటి ప్రపోజల్స్ నేను ఎప్పుడు వినలేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదని చెప్పుకొచ్చింది. సో ఈ మాటలతో రూమర్ తలవంచుకునే పరిస్థితి.
aslo read: Vilangu: 7.9 రేటింగ్‌తో ఓటీటీని అల్లాడిస్తున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో ఉంది
అదే ఇంటర్వ్యూలో అన్షు మాలిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తల పై స్పందించింది. రోజా మాట్లాడుతు భవిష్యత్తులో తన కూతురు యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. యాక్టింగ్ అనేది ఒక వరం. అది అందరికీ దొరకదు అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా పెళ్లి విషయంలో గాని, సినిమా విషయంలో గాని అంతిమ నిర్ణయం రోజా, సెల్వమణి ల ముద్దుల కూతురు అన్షుదే.







