TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

కేసిఆర్ కి తెలియకుండానే కేసిఆర్ పై సినిమా 

Nov 22, 2024 9:35AM

జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్(rocking rakesh)హీరోగా పరిచయమవుతున్న చిత్రం కేసిఆర్(kcr)అలియాస్ కేశవ చంద్ర రమావత్.ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి రాజశేఖర్ హీరోగా వచ్చిన 'గరుడవేగ' అనే చిత్రానికి ఫోటోగ్రఫిని అందించిన అంజి(anji)దర్శకత్వం వహించగా, రాకింగ్ రాకేష్ నే నిర్మాతగా కూడా వ్యవహరించాడు. 

రీసెంట్ గా ఈ చిత్రం గురించి రాకింగ్ రాకేష్ మాట్లాడుతూఈ మూవీలో నేను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అభిమానిగా కేశవ చంద్ర రమావత్ అనే బంజారా యువకుడిగా కనిపిస్తాను. అందుకే షార్ట్ కట్ లో కెసిఆర్ అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యడం జరిగింది.ఇందులో కెసిఆర్ కూడా నటించారు. ఆయనకి తెలియకుండానే ఆయన్ని పెట్టి ఈ సినిమా తీసాను,ఇదే నా చిత్రానికి ఓపెనింగ్స్ ని తీసుకొస్తుంది.ఇలాంటి మ్యాజిక్ లు సినిమాలో చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

అనన్య కృష్ణన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్,లోహిత్ కుమార్, ధనరాజ్,రచ్చరవి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రల్లో చెయ్యగా చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించడం జరిగింది.

 

google-ad-img