పవన్ కళ్యాణ్ నాకు దైర్యాన్నిచ్చారు: వైవిఎస్
on Dec 16, 2013
సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న "రేయ్" చిత్రం యొక్క ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్ లో నాగబాబు చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ... నమ్మిన సిద్ధాంతం కోసం, అంకిత భావంతో కష్టపడి ముందుకు వెళ్ళడం ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాను. అలాగే ఈ సినిమా నిర్మాణ విషయంలో కొన్ని సమస్యలు ఎదురైనపుడు "ఏం చేయను" అని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే..."కమిట్ మెంట్, కాండక్ట్ ని నమ్ముతాను. ఆ రెండు నీలో ఉన్నాయి. నువ్వు ఈ సినిమాను తప్పకుండా పూర్తి చేయగలవు" అని నాలో ధైర్యాన్ని నింపారు. ఈ సినిమాను ఇంత గ్రాండ్ గా పూర్తి చేయగలిగానంటే దానికి కారణం విరిద్దరే. సాయితో పనిచేస్తున్నప్పుడు చిరంజీవి గారితో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. డ్యాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేసాడు. యూత్ కు మంచి కిక్ ఇచ్చే ప్రేమకథ తీసాము. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నాము అని అన్నారు.