Home

»

Latest News

Renu desai: రేణు దేశాయ్ ఆయనకి అంధభక్తురాలంట.. ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మరి  

Mar 23, 2026

 

 

-వైరల్ గా మారిన రేణుదేశాయ్ పోస్ట్ 
-ఎందుకు ఎలా చేసింది 
-ఆ వ్యాఖ్యలు సరైనవేనా! 

రేణుదేశాయ్(Renudesai).. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాజీ వైఫ్ గా, నటిగా, సామాజిక వేత్తగా, జంతుప్రేమికురాలిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తన స్థానం శాశ్వత చిరునామా. అసలు రేణు దేశాయ్ సందడి లేని సోషల్ మీడియా, సోషల్ మీడియానే కాదు అనుకునే పరిస్థితి. అంతలా నెట్టింట తన హవా కొనసాగుతూ వస్తుంది. ఇదే కోవలో రీసెంట్ గా ఆమె చేసిన పోస్ట్ కొత్తగా రెక్కలు వచ్చినా గూటిలోని గువ్వ పిల్లకి అనే రీతిలో వైరల్ హోదాలో తన స్టార్ డమ్ కొనసాగిస్తోంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.


రేణుదేశాయ్ రీసెంట్ గా ధురంధర్ 2(Dhurandhar 2) ని వీక్షించడం జరిగింది. అనంతరం 'ఎక్స్' వేదికగా స్పందిస్తు 'నేను బీజేపీకి, దేశ‌ ప్రధాని మోదీకి గర్వించదగ్గ అంధభక్తురాలిని. దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పట్ల కనీస గౌరవం లేకుండా, దేశం గురించి తప్పుగా మాట్లాడే వారు ఖచ్చితంగా ‘ధురంధర్’ సిరీస్ చూడాలనే వ్యాఖ్యలు చేసింది. పార్ట్ 2 లో మోదీ గురించి దావూద్ ఇబ్రహీం క్యారక్టర్ మాట్లాడుతు ఈ ఛాయ్‌వాలా భారత్‌లోకి వచ్చాక మనవాళ్లలో భయం పెరిగిందని చెప్పే డైలాగ్‌ని  రీ షేర్ చేసింది.

Also read: ఓటిటిలో హిట్.. చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

ఇక ధురంధర్ 2 తన కలెక్షన్స్ సునామీని కొనసాగిస్తు 750 కోట్ల గ్రాస్ మార్కుని దాటింది. తెలుగు లాంగ్వేజ్ లోను అంబాటులో ఉన్న విషయం తెలిసిందే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com