మాస్ మహారాజా సుడి తిరిగింది!
on Jan 27, 2023
మాస్ మహారాజా రవితేజకు తన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు తాజాగా విడుదలైన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఒక ఎత్తు. ఈ చిత్రాలు రవితేజను 100 కోట్ల క్లబ్ లో నిలబెట్టాయి. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఆటోమేటిక్గా రవితేజ తదుపరి చిత్రం రావణాసురపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. రావణాసుర నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయట. జీ నెట్వర్క్ సంస్థ దీనిని సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకోగా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూనిక్ జోనర్లో తెరకెక్కుతోంది. అభిషేక్ పిక్చర్స్ ఆర్టిటి వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇక రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు రూపొందనుంది. ఇటీవల షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ కూడా బయటకు వచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.