
సినిమాల్లో కలిసి నటిస్తే ప్రేమలో పడటం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఇదంతా మనం చాలా సందర్భాల్లో చూశాం. కానీ పెళ్లయిన తర్వాత కూడా తన భర్త నటనకు ఓ అభిమానిలా ఫీలవుతుంటే మాత్రం ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇప్పుడు రష్మిక మందన్న కూడా అదే విషయాన్ని బయటపెట్టింది. విజయ్ దేవరకొండను చూస్తుంటే తనకు ఇప్పటికీ పెళ్లయిందనే ఫీలింగ్ రావడం లేదని చెప్పింది. అంతేకాదు.. ‘రణబాలి’ సెట్స్‌లో విజయ్ పర్ఫార్మెన్స్ చూసి భయపడిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేదికపై విజయ్ను చూస్తూ మురిసిపోయిన రష్మిక.. తన మనసులోని మాటను బయటపెట్టింది. “విజ్జూ.. నాకు అసలు పెళ్లయిందన్న ఫీలింగే కలగడం లేదు. నిన్ను చూస్తుంటే ఇప్పటికీ ఓ ఫ్యాన్ గర్ల్లాగే అనిపిస్తోంది. నీ వర్క్ కి నేను పెద్ద అభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది.
పెళ్లికి ముందు నుంచే విజయ్‌తో కలిసి నటించిన రష్మిక.. ఇప్పుడు నిజ జీవితంలోనూ అతడి భాగస్వామిగా మారింది. అయినప్పటికీ విజయ్ నటనను ఓ అభిమానిలా ఆస్వాదిస్తానని చెప్పడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘రణబాలి’ షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను కూడా రష్మిక పంచుకుంది. నెలకు నాలుగైదు రోజులు మాత్రమే సెట్‌కు వెళ్లేదాన్నని, తనకు మాత్రం అక్కడికి వెళ్తే పిక్నిక్కు వెళ్లినట్లుగా సరదాగా ఉండేదని చెప్పింది. కానీ విజయ్, దర్శకుడు రాహుల్, చిత్రబృందం మాత్రం చాలా సీరియస్‌గా పనిచేసేవారని తెలిపింది.
ముఖ్యంగా విజయ్ మీసాలు తిప్పుతూ రౌద్రంగా నటిస్తుంటే తనకు భయమేసేదని రష్మిక చెప్పుకొచ్చింది. సెట్లో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులంతా మరో స్థాయిలో పనిచేశారని వివరించింది. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారని తాను నమ్ముతున్నట్లు చెప్పింది.
గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్, రష్మిక జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘రణబాలి’లో మరోసారి ఈ జంట కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో తమ లవ్ ట్రాక్ అంతకుమించిన స్థాయిలో ఉంటుందని కూడా రష్మిక చెప్పింది.
మరి నిజ జీవితంలో ఒక్కటైన విజయ్, రష్మిక.. తెరపై మరోసారి తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారా? విజయ్ నటన గురించి రష్మిక ఇంతగా చెబుతున్న నేపథ్యంలో ‘రణబాలి’లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో చూడాలి.
ఇది కూడా చదవండి: జయలలితగా త్రిష.. కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ.!
[Rashmika Mandanna Speech, Ranabali Pre Release Event, Ranabali Movie, Rashmika Mandanna, Vijay Deverakonda, Rashmika Speech, Rahul Sankrityan, Telugu Film News]





