రంగీలా రీమిక్స్ లో రౌడీ
Feb 26, 2014 10:32AM

గతంలో వర్మ తెరకెక్కించిన "రంగీలా" సినిమా మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మోహన్ బాబు, విష్ణు నటిస్తున్న "రౌడీ" చిత్రంలో రంగీలా టైటిల్ సాంగ్ ను రీమిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ పాటను మోహన్ బాబు, జయసుధలపై తెరకెక్కించారట. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చివరి దశకు వచ్చేశాయి. విష్ణు సరసన శాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




