
రణబీర్ కపూర్ తన సినీ జన్మ ధన్య మయ్యేలా 'రాముడు' గా సెల్యులాయిడ్ పై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో కూడా వేగాన్ని పెంచాడు. ఇక రీసెంట్ గా జరిగిన దసరా వేడుకల్లో రణబీర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అదేంటి దసరాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే పూర్తి మ్యాటర్ చూద్దాం.
రామాయణ' సినిమా ప్రచారంలో భాగంగా అక్టోబర్ 20న కోల్‌కతాలో నిర్వహించిన దసరా వేడుకల్లో రణ్‌బీర్ కపూర్ పాల్గొన్నాడు. ఆ ఉత్సవాల్లో మాట్లాడుతు 'చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరికి సత్యం, మంచితనమే గెలుస్తాయని చెప్పబోయి, పొరపాటున చివరికి సత్యం, మంచితనమే అంతమవుతాయని అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఈ చిన్న మాట పొరపాటు కాస్తా క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. హిందూ పౌరాణిక ఇతిహాస ప్రధానమైన 'రామాయణం' చిత్రంలో సాక్షాత్తు శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న ప్రధాన నటుడే ఇలా మాట్లాడటంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ట్రోలింగ్ మొదలైంది.
ఇది కూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీ ఖాయమే!..వాళ్ళతో ఢిల్లీలో ధనుష్!

ఈ వివాదంపై ఎలాంటి మొహమాటం లేకుండా ఎంతో హుందాగా స్పందించిన రణ్‌బీర్ కపూర్, తాజాగా చెన్నై ట్రేడ్ సెంటర్లో జరిగిన 'రామాయణం' చిత్ర సంగీత వేడుక మరియు గ్రాండ్ ఆల్బమ్ లాంచ్ కార్యక్రమంలో అందరి సమక్షంలో బహిరంగంగా క్షమాపణలు కోరారు. తన ప్రసంగంలో దొర్లిన ఈ పొరపాటును పూర్తిగా అంగీకరిస్తూ, తాను మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. నిన్న కోల్‌కతాలో జరిగిన దసరా ఈవెంట్లో తన నోరు జారిందని, తాను చెప్పాలనుకున్న దానికి బదులుగా మరోలా మాటలు బయటకు వచ్చాయని వివరించారు. చెడు ఎంత బలమైనదైనా, చివరికి విజయం అనేది సత్యం, మంచితనానిదేనని తాను గట్టిగా నమ్ముతానని, ఆ ఉద్దేశంతోనే మాట్లాడబోయి మాట తడపడ్డానని స్పష్టం చేశాడు.
[Ranbir Kapoor Apology To Dussehra Issue, Ranbir Kapoor apology, Ramayana movie, Dussehra controversy, Ranbir speech slip, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





