
పెళ్ళి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తొలి సినిమా ‘రణబాలి’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి దూరంగా ఉన్న రష్మిక.. ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం విజయ్‌తో కలిసి సందడి చేయనున్నట్లు సమాచారం.
ఇటీవల ‘రణబాలి’ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. అయితే ఈ వేడుకలో విజయ్ దేవరకొండ కనిపించగా.. రష్మిక మాత్రం హాజరుకాలేదు. దీంతో అభిమానుల్లో పలు సందేహాలు మొదలయ్యాయి. దీనిపై విజయ్ స్పందిస్తూ.. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రష్మిక ట్రైలర్ ఈవెంట్‌కు రాలేకపోయిందని వివరణ ఇచ్చారు.
ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొంటారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అక్టోబర్ 13న సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు.
విడుదలకు కొద్ది రోజులే మిగిలి ఉండటంతో ప్రీ రిలీజ్ వేడుకపై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ ఈవెంట్‌కు దూరంగా ఉన్న రష్మిక.. ఈసారి విజయ్‌తో కలిసి వేదికపై కనిపిస్తారా? ఈ వేడుకలో సినిమా గురించి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ్.. తెలుగులో ఊహించని రెస్పాన్స్.!
[Ranabaali Pre Release Event, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabaali Release Date, Rahul Sankrityan, Mythri Movie Makers, Telugu Film News]





