Home

»

Latest News

రణబాలి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది భయ్యో: టాక్ ఇదే..ఇచ్చిన సర్టిఫికెట్ ఇదే!

Oct 13, 2026 2:42PM

 

విజయ్ దేవరకొండ, రష్మిక,  మైత్రి మూవీ మేకర్స్, రాహుల్ సంకృత్యాన్ 'రణబాలి' ద్వారా చేసే హంగామాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ట్రైలర్ తర్వాత సినీ సర్కిల్, అభిమానులు, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో రాయలసీమలో బ్రిటిష్ వాళ్లపై తిరగబడ్డ రాయలసీమ పోరాటయోధుడి నిజ జీవిత కథ కావడం కూడా   రణబాలి పై తెలుగు ప్రజల ఫోకస్ కూడా ఉంది. 

అయితే  రిలీజ్ కి ముందు సెన్సార్ కార్యకలాపాలు పూర్తి చేసుకుని టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో ఉన్న రస్టిక్ వైలెన్స్, చారిత్రక అంశాల నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సెన్సార్ అధికారులు ఈ చిత్రానికి ఒక్కటంటే ఒక్క కట్ కూడా సూచించకుండా క్లీన్ ‘యు/ఏ’ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు.  సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, బ్రిటిష్ పాలన నాటి దారుణాలు ఉన్నప్పటికీ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన విధానం, ఎమోషనల్ డెప్త్ సెన్సార్ సభ్యులను ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌కు సంబంధించి కూడా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ‘రణబాలి’ సినిమా మొత్తం రన్‌టైమ్‌ను సరిగ్గా 2 గంటల 50 నిమిషాలు (170 నిమిషాలు) లాక్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగే ఈ భారీ పీరియాడిక్ డ్రామా ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా థియేటర్లలో సీట్లకు కట్టిపడేసేలా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 


ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ క్లియరెన్స్ రావడంతో మేకర్స్, అభిమానుల్లో ఆనందం తారాస్థాయికి చేరింది.   1854 నుండి 1878 మధ్య సాగిన బ్రిటిష్ వలస పాలన కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని రాయలసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భయంకరమైన కరవు కాటకాలు, నాటి మొరటు జీవన విధానాన్ని ఈ చిత్రంలో అత్యంత వాస్తవికంగా చూపించబోతున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ‘శింగనమల బొబ్బిలి రణబాలి’అనే అత్యంత శక్తిమంతమైన వీరుడిగా కనిపించనున్నారు. అలాగే తెల్లదొరల అణచివేతకి ప్రతీకగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా కనిపిస్తుండటంనిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

ఇది కూడా చదవండి: ప్రముఖ అగ్ర నటుడు మృతి.. 34 ఏళ్ళే కావడంతో తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్ 

 

 


   మరి  గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్లీన్ యు/ఏ సర్టిఫికెట్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉండటంతో హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద  భారీ వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.

 

[Ranabaali First Review, Ranabali Censor Report, Vijay Deverakonda, Ranabaali, Ranabaali Censor Report, Ranabaali Runtime, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com