Home

»

Latest News

రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!

Oct 17, 2026 3:17PM


నా పేరు రణబాలి.. బ్రిటీష్ వాడు మన మీద పెత్తనం చేయడం ఏంటి? రాయలసీమలో నెలకొని ఉన్న కరువుని సైతం నా ప్రాణాలు ఇచ్చి అయినా దూరం చేస్తానని విజయ్ దేవరకొండ రణబాలిగా నిన్న వరల్డ్ వైడ్ సెల్యులాయిడ్ వద్ద ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అయితే మెజారిటీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వస్తుంది. కథ మెయిన్ పాయింట్ అయిన రాయలసీమ కరువు, అందుకు కారణమైన బ్రిటిష్ వాళ్ళ కథలోకి రణబాలి రావాలి గాని రణబాలి కథలోకి రాయలసీమ కరువు, అందుకు కారణమైన బ్రిటిష్ వాళ్ళు రావడంతో కథనం తేలిపోయిందనే మాటలు సినీ విశ్లేషకుల నుంచి వినపడుతున్నాయి. 


మరి మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఇండియా వైడ్ గా 10.75 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ 6 కోట్ల గ్రాస్ తో  టోటల్ వరల్డ్ వైడ్ గా 16.75 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్ సాధించి విజయ్ దేవరకొండ కెరీర్ లో టాప్ ఓపెనర్స్ లీగ్‌లో చేరింది.ఏరియా వారీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీ ఆదరణ లభించింది. రెండు రాష్ట్రాలు కలిపి తొలిరోజే  9.25 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ సాధించగా, అందులో ఒక్క తెలంగాణ నుంచే  4.43 కోట్ల వసూళ్లు నమోదుకావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో 3.23 కోట్ల గ్రాస్ సొంతమైంది.

ఇది కూడా చదవండి:  ఎవరు ఈ ఆనంది: గరివిడి లక్ష్మి తో మోత మోగిస్తూ ఉంది!

 


మిగతా రాష్ట్రాల్లో చూస్తే, కర్ణాటకలో  1.10 కోట్లు, తమిళనాడులో 15 లక్షలు, అలాగే మిగిలిన భారతీయ రాష్ట్రాల నుండి మరో  25 లక్షల వరకు రాబట్టింది. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో సగటున 54.7% థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. నైట్ షోలకు ఏకంగా 63.9% వరకు థియేటర్లు నిండిపోవడం ప్రేక్షకుల్లో రణబాలిపై  ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. మొదటి రోజున భారత్‌లో 2,515 షోల ద్వారా 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అయితే మేకర్స్ నుంచి తొలి రోజు కలెక్షన్స్ పై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

 


 [Ranabaali First Day Collections, Ranabaali Day 1 Collections, Vijay Deverakonda Ranabaali, Ranabaali Box Office Collection,Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com