Home

»

Latest News

రణబాలి బ్రేక్ ఈవెన్  టార్గెట్ ఎంత: మూడు రోజుల కలెక్షన్స్ పరిస్థితి ఇదే!

Oct 19, 2026 2:21PM

 

వరల్డ్ వైడ్ థియేటర్స్ లో  ‘రణబాలి' తన సత్తా చాటుతూ ఉంది. నిన్న సండే కావడంతో ప్రధాన నగరాల్లో థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిచ్చాయి. మరి దసరా ఫెస్టివల్ మూడ్ లో ప్రేక్షకులు ఉండటంతో ‘రణబాలి' రాబట్టే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇందుకు ప్రధాన కారణం నెగిటివ్ టాక్ రన్ అవుతుండటం. ఈ నేపథ్యంలో మూడు రోజులకి 'రణబాలి' ఎంత రాబట్టింది. బ్రేక్ ఎవెన్యూ టార్గెట్ ఎంతో చూద్దాం.  


తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 16.50 కోట్ల గ్రాస్ వసూళ్లని  రాబట్టింది.అందులో ఇండియా గ్రాస్ .10.75 కోట్లు. ఓవర్సీస్ గ్రాస్ 8.90 కోట్లు. అయితే, సినిమా ప్రదర్శన ప్రారంభమైన తర్వాత కొన్ని మిశ్రమ స్పందనలు ఎదురుకావడంతో బాక్సాఫీస్ వద్ద స్వల్ప ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు శనివారం వసూళ్లలో సుమారు 21.1 శాతం తగ్గుదల నమోదు కావడంతో ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ సండే  మంచి వసూళ్లే సాధించింది. 


ఇది కూడా చదవండి:  ది ప్యారడైజ్ ఓటిటి డేట్ ఇదే: వాళ్ళకి మాత్రం పండుగే! 

 


 తాజా ట్రేడ్ గణాంకాల ప్రకారం, ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 36.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (APTG) ప్రాంతాల్లోనే 23.50 కోట్ల మేర వసూళ్లను రాబట్టడం విశేషం. విజయ్ దేవరకొండ గత చిత్రాలైన ‘కింగ్‌డమ్’ వంటి భారీ ఓపెనింగ్స్‌తో పోలిస్తే కొన్ని మార్కెట్లలో కొద్దిగా వెనుకబడినప్పటికీ, ‘రణబాలి’ తనదైన శైలిలో నిలకడను కనబరుస్తోంది.120 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా థియేట్రికల్ బిజినెస్ 60 కోట్ల  మేర జరిగినట్టుగా చెప్తున్నారు. దీంతో రణబాలి క్లీన్ హిట్ గా నిలవాలంటే 120 కోట్ల గ్రాస్ రావాలి. అంటే 60 కోట్ల షేర్ రావాలనే మాటలు సినీ బిజినెస్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.

 

 

[Ranabaali Collections, Ranabaali break even target Ranabaali box office collection, Vijay Deverakonda Ranabaali, Ranabaali total collections, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com