రానా ఫ్యామిలీకి ముందే తెలుసు!
on May 13, 2020
భల్లాలదేవ రానా దగ్గుబాటి తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను సోషల్ మీడియాలో పరిచయం చేయడం ఆలస్యం.. ఆ వార్త వైరల్‌గా మారింది. తమ గుండెలు పగిలాయని లేడీ ఫ్యాన్స్ ఆక్రోశిస్తే, మిగతా ఫ్యాన్స్ అతడిని అభినందనల్లో ముంచెత్తారు. ఆ ఇద్దరి ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, వాళ్ల మధ్య అనుబంధం గురించి రానా ఫ్యామిలీకి కొంత కాలంగా తెలుసని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. లాక్డౌన్ ముగియగానే వాళ్లకు నిశ్చితార్ధం జరపడానికి రానా తండ్రి సురేశ్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు.
"లాక్డౌన్లో మిహీకాకు రానా పరోక్షంగా ప్రపోజ్ చేశాడు. ఇంటీరియర్ డిజైనర్, ఈవెంట్ మేనేజర్ అయిన మిహీకాతో కొంత కాలంగా అతడు అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సంక్షోభ స్థితి ఉన్నందున ఇంకా ఎంగేజ్మెంట్ జరపలేదు కానీ జరపడం ఖాయం. ఆ ఇద్దరి కుటుంబాలతో పాటు సన్నిహిత స్నేహితులకూ వాళ్ల బంధం గురించి తెలియడమే కాదు, వాళ్లు పెళ్లాడాలనుకుంటున్నారనే విషయం కూడా తెలుసు. సమాజంలో సాధారణ స్థితులు నెలకొన్నాక పెళ్లి పనులు మొదలవనున్నాయి" అని రానా సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
