TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ప్రముఖ గాయని రమ్య బెహరా రహస్య వివాహం..వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Nov 16, 2024 2:55PM

2009 లో కీరవాణి(keeravani)సంగీత సారథ్యంలో తెరకెక్కిన వెంగమాంబ చిత్రం ద్వారావెండి తెరకు పరిచయం అయిన గాయని రమ్య బెహరా(ramya behara)ఆ తర్వాత బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానంభవతి వంటి తెలుగు చిత్రాలే కాకుండా, పలు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా కలుపుకొని ఇప్పటికి వరకు మొత్తం నూట ఎనభై పాటల దాకా పాడింది. 

 రమ్య ఈ రోజు శుక్రవారం తన తోటి గాయకుడైన అనురాగ్ కులకర్ణి(anurag kulkarni)ని వివాహం చేసుకుంది.హైదరాబాద్ లో ఎంతో సీక్రెట్ గా జరిగిన ఈ వివాహానికి అతి కొద్దీ మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.వివాహ విషయాన్నీ ముందుగా వెల్లడి చెయ్యలేదు.అయితే వీరిద్దరిది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది.కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు కుటుంబసభ్యుల అంగీకారంతో  పెళ్లి పీటలెక్కారని అంటున్నారు.

అనురాగ్ కులకర్ణి కూడా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు.కేర్ ఆఫ్ కంచెరపాలెం, ఆర్ఎక్స్ 100 ,కాటమరాయుడు, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్, వంటి చిత్రాల్లోని పాటలు అనురాగ్ కి మంచి పేరుని తెచ్చిపెట్టాయి.అనురాగ్ స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి కాగా రమ్య ది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకి దగ్గరలో ఉన్న నరసారావుపేట.  

 

google-ad-img