Home

»

Latest News

రామాయణ రెమ్యునరేషన్ వివరాలు ఇవే!

Oct 21, 2026 2:27PM

భారతీయ సినీ ప్రేమికులు, రామ భక్తులందరు కంప్లీట్ రామాయణ పార్ట్ 1  మూడ్ లోకి వచ్చేసారు. రిలీజ్ డేట్ నవంబర్ 5 కి  కౌంట్ డౌన్ కూడా మొదలవడంతో రామాయణ ఎలా ఉండబోతుందో అంటూ ట్రైలర్ ని పదే పదే చూసుకుంటూ మురిసిపోతున్నారు.  పైగా క్యారెక్టర్స్ గురించి రోజుకొక ఆసక్తికర విషయాన్నీ రివీల్ చేస్తు అభిమానులు, సినీ ప్రియుల్లో రామ జోష్ ని  తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా రామాయణ మూవీకి సంబంధించి నటీనటులు అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. మరి మనం కూడా ఒక లుక్ వేద్దాం. 

రాముడైన రణబీర్ కపూర్ ఒక్కో పార్టుకి  సుమారు 75 కోట్ల రూపాయల చొప్పున, మొత్తం రెండు భాగాలకు కలిపి  150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం కావడం విశేషం. గతంలో ఆయన నటించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి 25 నుండి 30 కోట్ల రూపాయలు, అలాగే బ్లాక్‌బస్టర్ హిట్ 'యానిమల్' చిత్రానికి 30 నుండి 35 కోట్ల రూపాయలతో పాటు ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్న రణబీర్, ఇప్పుడు 'రామాయణం'తో తన రేంజ్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు. లంకానిలయ దశకంఠుడు రావణాసురుడు గా చేస్తున్న యష్ ఒక్కో భాగానికి 50 కోట్ల రూపాయల చొప్పున మొత్తం రెండు భాగాలకి  100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల సమయంలో ఆయన తీసుకున్న 30 నుండి 35 కోట్ల రూపాయల పారితోషికంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంతేకాకుండా, యష్ తన 'మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్' బేనర్ ద్వారా ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తూ లాభాల్లో వాటా పంచుకుంటున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: నయనతార 'మహాశక్తి' ట్రైలర్ వచ్చేసింది: అమ్మవారిగా లేడీ సూపర్‌స్టార్ విశ్వరూపం!

 

జగద్జన్మని సీతాదేవి  సాయి పల్లవి ఒక్కో భాగానికి 6 కోట్ల రూపాయల చొప్పున మొత్తం రెండు భాగాలకి కలిపి 12 కోట్ల రూపాయలని పారితోషికంగా తీసుకుందని టాక్.  తన గత చిత్రం 'తండేల్' సినిమాకు 5 కోట్ల రూపాయలు తీసుకోగా, ఇప్పుడు 'రామాయణం' ఆమె కెరీర్‌లోనే హయ్యెస్ట్.రామదూత హనుమంతుడు  సన్నీ డియోల్ 40 కోట్ల రూపాయలు (ఒక్కో భాగానికి 20 కోట్లు), లక్ష్మణుడిగా చేస్తున్న రవి దూబే 2 నుండి 4 కోట్ల రూపాయలు, కైకేయి  లారా దత్తా 3 కోట్ల రూపాయలు,  దశరథుడు అరుణ్ గోవిల్ 2.5 కోట్ల రూపాయల చొప్పున పారితోషికాలు అందుకుంటున్నట్లు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలోనే సుమారు 4000 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న రామాయణకి  నితీష్ తివారీ దర్శకుడు.  నిర్మాత నమిత్ మల్హోత్రా.

 

[Ramayana Movie Cast Remunerations, Ramayana movie cast salary, Ranbir Kapoor Ramayana remuneration, Yash Ravana fee, sai pallavi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com