రామ్ చరణ్ ఏంటి ఇలా అయిపోయాడు!
on May 1, 2024
రామ్ చరణ్(Ram Charan) ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన డ్రెసింగ్ స్టైల్ ని ఫాలో అవ్వడానికి ఎందరో ఆసక్తి చూపిస్తుంటారు. రామ్ చరణ్ అలా బయట కనిపిస్తే చాలు.. నిమిషాల్లో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా చరణ్ మరోసారి తన ఆఫ్ స్క్రీన్ లుక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.
తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు చరణ్. వైట్ షర్ట్ ధరించి, క్యాప్, కళ్ళద్దాలతో చరణ్ స్టైల్ గా ఉన్నాడు. అలాగే ఎక్కువగా గుబురు గడ్డం, మీసంతో కనిపించే చరణ్.. ఈసారి మాత్రం క్లీన్ షేవ్, చిన్న మీసకట్టుతో కనిపిస్తున్నాడు. ఇది ఆయన రాబోయే చిత్రం 'గేమ్ ఛేంజర్'(Game Changer)లో లుక్ అని తెలుస్తోంది. 'గేమ్ ఛేంజర్'లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రలో ఇలా క్లీన్ షేవ్, చిన్న మీసకట్టుతో కనిపించనున్నాడని సమాచారం.
ఏది ఏమైనా చరణ్ తాజా లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఆయన న్యూ లుక్ చూసి.. చరణ్ ఏంటి ఇలా మారిపోయాడు అని షాక్ అవుతున్నారు.
Also Read