
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ‘నరసింహా’కు ఉండే ప్రత్యేకతే వేరు. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడమే కాదు.. రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇన్నేళ్ల తర్వాత రీ-రిలీజ్‌లోనూ ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో సీక్వెల్‌పై మరోసారి ఆసక్తి పెరిగింది.
‘నరసింహా 2’ కథపై గతంలోనే చర్చలు జరిగినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కేఎస్ రవికుమార్ వెల్లడించారు. మొదటి భాగంలో చనిపోయిన నీలాంబరి పునర్జన్మ ఎత్తి, నరసింహాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే కథాంశాన్ని ఆయన సిద్ధం చేశారట. ఈ ఆలోచనతో పాటు మరో కథా లైన్‌ను కూడా రజనీకాంత్‌కు వినిపించారట.
అయితే, నరసింహా రీ-రిలీజ్ కి వచ్చిన అద్భుతమైన చూసిన తర్వాత సీక్వెల్ విషయంలో రజనీ ఆలోచన మారిందట. అప్పటి ప్రేక్షకులతో పాటు నేటి యువతను కూడా ఆకట్టుకునేలా కథ, స్క్రీన్‌ప్లే ఉండాలని సూచించారట. దీంతో స్క్రిప్ట్ పై కేఎస్ రవికుమార్ మరింత శ్రద్దగా వర్క్ చేస్తున్నారు.
నిజానికి సీక్వెల్ అంటే పాత సినిమాలోని పాత్రలను మళ్లీ చూపించడమే కాదు.. మొదటి భాగానికి తగ్గ స్థాయిలో భావోద్వేగాలు, కథా బలం ఉండాలి. ‘నరసింహా’లో రజనీకాంత్-నీలాంబరి మధ్య పోరాటం ఎంత కీలకంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రెండో భాగంలోనూ ఆ స్థాయి సంఘర్షణను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం 'జైలర్ 2'తో బాక్సాఫీస్ ను చేస్తున్న రజినీకాంత్.. ‘నరసింహా 2’తో ఇంతకుమించిన విధ్వంసం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం క్లాసిక్ మూవీని టచ్ చేయొద్దని, అప్పటి మ్యాజిక్ చేయడం కష్టమని కోరుతున్నారు. మరి స్క్రిప్ట్ విన్నాక ఈ ప్రాజెక్ట్ విషయంలో సూపర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు: నంబర్ 1 ఏదో తెలుసా.?
[Rajinikanth Narasimha 2 Update, Rajinikanth Padayappa 2 Update, Narasimha Neelambari, Rajinikanth New Movie, Rajinikanth, Narasimha 2, Padayappa 2, Neelambari, KS Ravikumar, Telugu Film News]






