Home

»

Latest News

రణబాలి 2 కథ లీక్: ఇది ఆ దర్శకుడి పనేనా!

Oct 21, 2026 12:51PM

 

విజయ్ దేవరకొండ, రష్మిక, మైత్రి మూవీ మేకర్స్,  రాహుల్ సాంకృత్యాన్  ప్రస్తుతం 'రణబాలి' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.  విజయ్ తో పాటు ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేసినా ప్రేక్షకుల మూడ్ ని క్యాచ్ అయ్యేలా కథనం ఉండి ఉంటే రణబాలి మరింత బెటర్ పొజిషన్ లో ఉండేదనే మాటలు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా 52 కోట్ల గ్రాస్ లోకి అడుగుపెట్టినట్టుగా బాక్స్ ఆఫీస్ లెక్కలు చెప్తున్నాయి.

అయితే రణబాలికి  సీక్వెల్ వస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతు 'రణబాలి’కి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీసే ఆలోచన ఉంది. రణబాలి తండ్రి, జయమ్మ, గౌడప్పల గత జీవితాల ఆధారంగా ఈ ప్రీక్వెల్ కథని  రూపొందించాలని భావిస్తున్నాను. వారి జీవితాలను రణబాలి విధికి, అతని కుమారుడి భవిష్యత్తుకు మరియు పోర్టు నుంచి తప్పించుకున్న బ్రిటిష్ వ్యక్తి కథకి  ముడిపెడుతూతెరకెక్కించనున్నట్లు రాహుల్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: శంకర్ కి బిగ్ షాక్: ఇండియన్ 3 ప్రపోజల్ రిజెక్ట్ చేసిన ఆ అగ్ర నిర్మాణ సంస్థ!

 

దర్శకుడి ఈ ప్రకటనతో విజయ్, రష్మికల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, ప్రస్తుతం హీరో హీరోయిన్లు వేర్వేరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల ‘రణబాలి’ ప్రీక్వెల్ పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండచ్చనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.  ప్రీక్వెల్ అంటే ముందు జరిగిన కథ అనే విషయం తెలిసిందే.

 

 

[Rahul Sankrityan About Ranabaali 2, Ranabaali Collections, Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabaali box office,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
    

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com