'రభస' ప్రీ రిలీజ్ ఇండస్ట్రీ రిపోర్ట్..!
on Aug 25, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద 'రభస' చేయడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలివున్నాయి. గత చిత్రం 'రామయ్య వస్తావయ్యా'తో దెబ్బతిన్న యంగ్ టైగర్ దీనిపైన బోలెడు ఆశలుపెట్టుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ కి సరైన హిట్ లేకపోయిన ఈ సినిమా అన్ని కలిపి దాదాపు 55కోట్ల బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్స్ చూస్తే సగటు మాస్ ప్రేక్షకుడు కోరుకొనే అంశాలు అన్ని ఇందులో వున్నాయని అనిపిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ఏంటీ? ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం ప్రకారం..రభసపై అభిమానులలో హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నా, డీసెంట్ మూవీ అని అంటున్నారు.
ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో కాలేజి స్టూడెంట్ గా ఫన్ తో హీరోయిన్స్ ని టీజ్ చేస్తూ కథని నడిపి, సెకండ్ ఆఫ్ లో అసలు కథ మొదలవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్, ప్రణీత, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి అని అంటున్నారు.ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కూడా సెకండ్ ఆఫ్ అంటా. సెకండాఫ్ మొత్తం యాక్షన్ తో ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా బ్రహ్మానందం ఎన్టీఆర్ ల కామెడీ ప్రేక్షకులను అలరిస్తు౦దని అంటున్నారు. మూడు పాటలకి ఎన్టీఆర్ డాన్సులు కూడా ఇరగదీశాడట. మొత్తానికి సినిమా బాగానే వచ్చిందని కాకపోతే ఎన్టీఆర్ కోరుకుంటున్న హిట్ ఈ సినిమా ఇస్తుందా లేదా అనేది రిలీజ్ వరకు వేచి చూడలట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
