కలెక్షన్లలో నంబర్ వన్ ఇండియన్ మూవీగా 'పుష్ప'.. తగ్గేదే లే!
on Dec 18, 2021

అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన 'పుష్ప: ది రైజ్' తొలిరోజు వెల్లువెత్తిన అంచనాలకు తగ్గ కలెక్షన్స్‌ను రాబట్టింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 2021లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సుకుమార్ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ. 71 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు.
Also read: 'వకీల్ సాబ్' తర్వాతి ప్లేస్‌లో 'పుష్ప'! మూడో ప్లేస్‌లో 'అఖండ'!
ఈ మేరకు ఒక పోస్టర్‌ను షేర్ చేసిన మేకర్స్ తమ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో, "2021 INDIA'S BIGGEST DAY 1 GROSSER #PushpaTheRise strikes big at the Box Office MASSive 71CR Gross Worldwide" అంటూ రాసుకొచ్చారు.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 'పుష్ప' తర్వాతి ప్లేస్‌లో రూ. 52.40 కోట్లతో పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' నిలవగా, రూ. 50.85 కోట్ల గ్రాస్‌తో రజనీకాత్ 'అణ్ణాత్తే' మూడో ప్లేస్‌లో ఉంది. విజయ్ 'మాస్టర్' రూ. 50.02 కోట్లు, అక్షయ్‌కుమార్ 'సూర్యవంశీ' రూ. 39.60 కోట్లు, బాలకృష్ణ 'అఖండ' రూ. 29.50 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాలు పొందాయి.
Also read: 'పుష్ప' చేయను నన్ను వదిలేయండన్నా.. 'సుకుమార్' నా ముందు డ్యాన్స్ చేశారు!
తెలుగునాట మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, మిగతాచోట్ల 'పుష్ప'కు పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో అనూహ్యమైన రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి. పుష్పరాజుగా బన్నీ చెలరేగి చేసిన నటనకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీతో బన్నీ సైతం పాన్ ఇండియా స్టార్‌గా అవతరించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



