'వకీల్ సాబ్' తర్వాతి ప్లేస్‌లో 'పుష్ప'! మూడో ప్లేస్‌లో 'అఖండ'!
on Dec 18, 2021

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' తొలిరోజు అంచనాలకు తగ్గ కలెక్షన్స్‌ను రాబట్టింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.90 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కలెక్షన్ పరంగా 2021లో 'పుష్ప' సెకండ్ ప్లేస్‌లో నిలిచి, బాలకృష్ణ 'అఖండ'ను మూడో స్థానానికి నెట్టేసింది. ఫస్ట్ ప్లేస్‌ను పవన్ కల్యాణ్ సినిమా 'వకీల్ సాబ్' నిలబెట్టుకుంది. ఆ సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.24 కోట్ల షేర్ రాబట్టింది.
'అఖండ' మూవీకి తొలిరోజు రూ. 15.39 కోట్ల షేర్ వచ్చింది. వీటి తర్వాత స్థానాల్లో 2021లో ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధించి 'ఉప్పెన' (రూ. 9.35 కోట్లు), 'లవ్ స్టోరీ' (రూ. 7.13 కోట్లు), 'క్రాక్' (రూ. 6.25 కోట్లు), 'రెడ్' (రూ. 5.47 కోట్లు), 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' (రూ. 5.45 కోట్లు) సినిమాలు ఉన్నాయి.
తెలంగాణలో ఐదో ఆటకు ప్రభుత్వం అనుమతించడం వల్ల ఆ మేర 'పుష్ప'కు లాభం చేకూరింది. ఆంధ్రలో ఎక్స్‌ట్రా షోలకు అక్కడి ప్రభుత్వం రెడ్ సిగ్నల్ చూపించడం తెలిసిందే. అయినప్పటికీ ఆంధ్ర, రాయలసీమ ఏరియా కలిపి 'పుష్ప' రూ. 13.46 కోట్ల షేర్ రావడం విశేషమే.
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగునాట అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో 'పుష్ప' చూపించింది. పుష్పరాజుగా బన్నీ చెలరేగి చేసిన నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. క్లైమాక్స్ వీక్‌గా ఉందనే టాక్ ఒక్కటే సినిమాకు మైనస్ అని చెప్పాలి. రష్మిక మందన్నతో బన్నీ రొమాన్స్ ఆకట్టుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



