సాయిపల్లవి ఎందుకంత ఎమోషనల్ అయ్యింది?
on Dec 19, 2021

నాని టైటిల్ రోల్ చేసిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలవుతోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించగా, ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఒక కీలక పాత్ర చేసింది. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతున్న సందర్భంగా సాయిపల్లవి చాలా ఎమోషనల్ అవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి కూడా. ఇంతదాకా పల్లవి ఇలా ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఇలా ఎమోషనల్ అవడం ఎప్పుడూ చూడలేదు.
Also read: 2021 జ్ఞాపకాలుః వెండితెరపై విరిసిన కొత్తందాలు.. బెస్ట్ డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి!
ఈ ఈవెంట్‌లో సాయిపల్లవి మాట్లాడుతూ.. "ఈ కళలు మనకు దేవుడు ఇస్తాడు. అవి మనకు రావడం అదృష్టం. కొందరికి దేవుడు పుట్టుకతోనే ఇస్తాడు. ఇంకొందరు ఎంతో కష్టపడి నేర్చుకుంటారు. నటించాలని, డ్యాన్స్ చేయాలని ఎంతో మందికి ఉంటుంది. కానీ కొంతమందే అవుతారు. కొంతమందికే అవకాశాలు వస్తాయి. నాకు ఈ ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చినందుకు, నన్ను నమ్మి పాత్రలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. ఇదంతా కూడా ఆడియెన్స్ నన్ను అంగీకరించినందున జరిగింది. వారే నమ్మకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఇలాంటి చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేషనల్ అవార్డ్, ఆస్కార్ వచ్చినప్పుడే ఇలా ఏడుస్తానని అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు ఏడుపు వచ్చేసింది. నటిగా మారడమే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది. మా అందరినీ ఇంత ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్" అని చెప్పింది. అలా చెప్తున్నంతసేపూ తను భావోద్వేగాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. స్పీచ్ అయ్యాక నాని దగ్గరకు వెళ్లగా, అతనామెను ఆప్యాయంగా హత్తుకున్నాడు.
Also read: తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప' ఫస్ట్ డే కలెక్షన్ ఇదే!
ఆ తర్వాత మాట్లాడిన నాని, "సాయిపల్లవి ఎందుకంత ఎమోషనల్ అయ్యిందో 24న అందరికీ అర్థమవుతుంది." అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



