2021 జ్ఞాపకాలుః వెండితెరపై విరిసిన కొత్తందాలు.. బెస్ట్ డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి!
on Dec 18, 2021
.webp)
ప్రతీ సంవత్సరంలాగే ఈ క్యాలెండర్ ఇయర్ లోనూ కొంతమంది నూతన కథానాయికలు.. వెండితెరపై వెలుగులు పంచారు. అయితే, వారిలో కొందరు మాత్రమే సక్సెస్ చూశారు. 2021లో తెలుగుతెరపై విరిసిన ఆ కొత్తందాల వివరాల్లోకి వెళితే..
అమృతా అయ్యర్ః- గతంలో `కాశి`, `విజిల్` వంటి అనువాద చిత్రాలతో తెలుగునాట సందడి చేసిన అమృతా అయ్యర్.. రామ్ నటించిన `రెడ్` చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా టాలీవుడ్ లో నేరుగా ఎంట్రీ ఇచ్చింది. ఆపై `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?` తో నాయికగా తొలి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది చివరి రోజున విడుదల కానున్న నాలుగు చిత్రాల్లో ఒకటైన `అర్జున ఫల్గుణ`లోనూ తనే కథానాయిక.
Also Read: 2021 జ్ఞాపకాలుః `జీరో రిలీజ్ ఇయర్` స్టార్స్!
కృతి శెట్టిః- ఈ యేటి మేటి విజయాల్లో ఒకటైన `ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్ లో డ్రీమ్ డెబ్యూ ఇచ్చింది కృతి శెట్టి. బేబమ్మ పాత్రలో తనదైన అభినయంతో కుర్రకారుని ఫిదా చేసింది. వరుస అవకాశాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. ఇక ఈ ఏడాది క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ కానున్న `శ్యామ్ సింగ రాయ్`లోనూ ఓ హీరోయిన్ గా ఎంటర్టైన్ చేయబోతోంది కృతి. ఓవరాల్ గా.. `ఉప్పెన`తో `2021 బెస్ట్ డెబ్యూ హీరోయిన్`గా నిలిచింది కృతి శెట్టి.
Also Read: 2021 జ్ఞాపకాలుః మెప్పించిన నవతరం దర్శకులు..
ప్రియా ప్రకాశ్ వారియర్ః- వింక్ బ్యూటీగా పాపులర్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలైన `చెక్`తో తెలుగునాట హీరోయిన్ గా నేరుగా ఎంట్రీ ఇచ్చింది. ఆపై `ఇష్క్`తోనూ సందడి చేసింది. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ప్రియకి అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి.
ఫరియా అబ్దుల్లాః- మార్చి సెన్సేషన్ `జాతిరత్నాలు` చిత్రంతో నాయికగా తొలి అడుగేసింది తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా. చిట్టి పాత్రలో కుర్రకారుని ఫిదా చేసింది. ఆపై `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కోసం అతిథి పాత్రలో సందడి చేసింది. వచ్చే ఏడాది మరిన్ని సినిమాల్లో కనువిందు చేయనుంది.
శ్రీలీలః- `పెళ్ళి సందD` చిత్రంతో తెలుగు తెరకు నాయికగా పరిచయమైంది కన్నడ కస్తూరి శ్రీలీల. మ్యూజికల్ గా మెప్పించిన ఈ సినిమాలో తన అందాలతో, నృత్యాలతో కుర్రకారుని ఫిదా చేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. త్వరలో రవితేజ `ధమాకా`తో పలకరించబోతోంది.
కేతికా శర్మః- `రొమాంటిక్` చిత్రంతో తెలుగునాట నాయికగా పరిచయమైంది కేతికా శర్మ. తన హాట్ హాట్ లుక్స్ తో యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆనక `లక్ష్య`లోనూ సందడి చేసింది. ఈ రెండు సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా పరిశ్రమ దృష్టిలో పడింది. వచ్చే సంవత్సరం మరిన్ని చిత్రాల్లో ఎంటర్టైన్ చేయనుంది కేతిక.
శివానీ రాజశేఖర్ః- సీనియర్ హీరో రాజశేఖర్ - నటి జీవిత పెద్దమ్మాయి శివానీ రాజశేఖర్ ఈ సంవత్సరం `అద్భుతం` చిత్రంతో నాయికగా పరిచయమైంది. ఓటీటీలో స్ట్రీమ్ అయిన ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
Also Read: 2021 జ్ఞాపకాలుః స్టార్ బ్యూటీస్ కేరాఫ్ వెబ్ - సిరీస్
వీరితో పాటు లవ్లీ సింగ్ (గాలి సంపత్), దియా మీర్జా (వైల్డ్ డాగ్), సంధ్యా రాజు (నాట్యం), తాన్యా రవిచంద్రన్ (రాజా విక్రమార్క), గీత్ సైని (పుష్పక విమానం), కాశిష్ ఖాన్ (అనుభవించు రాజా) వంటి నాయికలు కూడా ఈ ఏడాది తెలుగునాట నేరుగా సందడి చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



