'పుష్ప' చేయను నన్ను వదిలేయండన్నా.. 'సుకుమార్' నా ముందు డ్యాన్స్ చేశారు!
on Dec 18, 2021

'ఆర్య', 'ఆర్య-2' సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప ది రైజ్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి రోజే కలెక్షన్లతో అదరగొట్టింది. మూవీలో బన్నీ నటనకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఈ సినిమాలో కొండారెడ్డి అనే నెగటివ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. మూవీకి, తన పాత్రకి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో.. తాజాగా 'తెలుగు వన్' యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా నేను చేయలేనని దండం పెట్టానని, సుకుమార్ వల్ల చేయక తప్పలేదని చెప్పారు.
Also Read: 'పుష్ప' మూవీ రివ్యూ
"పుష్ప నాకు పునర్జన్మ ఇచ్చింది. నటుడిగా మళ్ళీ మీ ముందు ఇలా ఉన్నానంటే దానికి పుష్ప సినిమానే కారణం. అయితే అసలు ఈ సినిమా నేను చేయకూడదు అనుకున్నాను. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే నన్ను కూడా కరోనా దెబ్బతీసింది. ఇంటినుంచి బయటకు రావాలంటేనే భయపడేవాడిని. ఫస్ట్ వేవ్ రావడానికి కొన్ని నెలల ముందు నాకు హార్ట్ లో స్టెంట్ వేశారు. అప్పుడు బాగానే ఉన్నాను. కరోనా వచ్చాకే భయం మొదలైంది. దానికితోడు అదే సమయంలో తెలిసినవాళ్ళు ఒక ప్రాజెక్ట్ పేరుతో నన్ను మానసికంగా బాగా ఇబ్బందులకు గురిచేశారు. అప్పుడు మానసికంగా, ఆరోగ్యపరంగా భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్న. దీంతో ఇక సినిమాలు వద్దనుకున్నా. అప్పటికే నాకు పుష్ప అవకాశం వచ్చి ఉంది. కానీ దీని తర్వాత పుష్ప టీమ్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా.. ఈ సినిమా నేను చేయలేను, నన్ను వదిలేయండి అని చెప్పాను. ఇక చివరికి సుకుమారే స్వయంగా నాతో ఫోన్ లో మాట్లాడారు. ఆయనతో అరగంట ఫోన్ మాట్లాడక.. నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. సుకుమార్ అంతలా నన్ను మోటివేట్ చేశారు" అని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.
Also Read: పుష్ప.. అంచనాలను మించి ఫస్ట్ డే వసూళ్లు రాబట్టిన హిందీ వెర్షన్!
"మారేడుమిల్లిలో షూట్ స్టార్ట్ అయింది. షూట్ దగ్గర కూడా నేను ఉండను, వెళ్ళిపోతాను అనేవాడిని. నన్ను దాని నుంచి బయటకు తీసుకొచ్చి, మూడ్ లోకి తీసుకురావడానికి సుకుమార్ నా ముందు డ్యాన్స్ కూడా చేశారు. నేను నటించిన తమిళ్ మూవీ మూకుతి అమ్మన్ లో ఒక సాంగ్ ఉంటుంది నా మీద. అజయ్ ఇంతేగా వేసేది అంటూ డ్యాన్స్ వేసి నన్ను హుషారు చేశారు. సినిమా అంటే ఆయనకు అంత తపన" అని అజయ్ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



