TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఆ ఒక్క చోటే 600 కోట్లు వసూలు చేసిన పుష్ప 2

Dec 18, 2024 3:44PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)రష్మిక(rashmika)సుకుమార్(sukumar)మైత్రి మూవీ మేకర్స్,(mythri movie makers)దేవిశ్రీప్రసాద్(devi sriprasad)చంద్రబోస్(chandrabose)ఈ ఆరుగురి కాంబోలో మరోసారి పుష్ప పార్ట్ వన్ కి సిక్వెల్ గా పుష్ప 2(pushpa 2)డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్   వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా కూడా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అయితే పుష్ప 2 ఫీవర్ ఒక రేంజ్ లో ఉంది. ఇప్పటికే తొలి రోజు కలెక్షన్స్ లో అక్కడి హీరోల సినిమాలని కూడా దాటేసిన పుష్ప రాజ్ ఇప్పుడు మరో నయా రికార్డుని
సాధించాడు.

 లేటెస్ట్ గా హిందీ బెల్ట్ లో పుష్ప 2 600 కోట్ల క్లబ్ లోకి చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న మంగళవారం 19 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న పుష్ప 2  అఫీషియల్ గా 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పుడు ఈ లెక్కలతో పుష్ప 2 కలెక్షన్స్ కి హిందీ బెల్ట్ లో ఎప్పుడు ఎండింగ్ కార్డు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే సినిమా వచ్చి కేవలం పదమూడురోజులే అయ్యింది.పైగా హిట్ టాక్ కూడా ఉండటంతో లాంగ్ రన్ లో వెయ్యి కోట్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.

 


 

google-ad-img