TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Jan 31, 2025 8:47AM

 

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. (Producer Vedaraju Timber)

 

అల్లరి నరేష్ తో 'మడత కాజా', 'సంఘర్షణ'  వంటి చిత్రాలను నిర్మించారు వేదరాజు టింబర్. సినిమాల పై ఇష్టంతో  ఓ వైపు కన్‌స్ట్రక్షన్‌ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించారు. త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ విషాద సంఘటన జరిగింది. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని వస్తారని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు ఈ రోజు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

google-ad-img