
-ప్రియాంక మోహన్ గురించి ఎందుకు అలా చెప్తున్నారు
-అసలు సోషల్ మీడియాలో ఏముంది
-అభిమానుల ఆవేదన
అందానికి సరికొత్త నిర్వచనాన్ని వెతికేంత అందం 'ప్రియాంక మోహన్'(Priyanka Mohan)సొంతం. తన కంటు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే తన నుంచి సినిమా వచ్చిన రోజు థియేటర్ కి వెళ్లి కొంత మంది ప్రేక్షకులని జస్ట్ టచ్ చేస్తే చాలు మేము ప్రియాంక మోహన్ అభిమానులమని చెప్పేస్తారు. గత సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)'ఓజి'లో కన్మణి గా చేసి మెప్పించింది. ఆ థియేటర్ దగ్గర కూడా సేమ్ సిట్యువేషన్ కనపడిందంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్నివిషయాలతో అభిమానులు, నెటిజన్స్ ఒక్కసారిగా ఉలిక్కి పాటుకి గురవుతున్నారు. ఆ మాటలేంటో చూద్దాం.
రీసెంట్ గా ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నాపై దుష్రపచారం జరుగుతుంది. ద్వేషాన్ని చిమ్ముతు ట్రోల్ల్స్ కూడా చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరి చేయిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీని వెనక ఒక టీం పని చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా ఇవన్నీ చూశాను. మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని క్రిందకు లాగే వాళ్లు, మనపై చెడు ప్రచారం చేసే వాళ్లు ఉంటారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. గతం గురించి పట్టించుకునే పరిస్ధితుల్లో నేను ఇప్పుడు లేను. సినీ పరిశ్రమ నిలకడ లేని పరిశ్రమ. ఇక్కడ ఎవరికైనా నాలాంటి పరిస్ధితి ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిస్థితులే మనల్ని దృఢంగా మారుస్తాయని నేను నమ్ముతాను. నా జీవితంలో ఎన్నో చూశాను. ఈ ట్రోలింగ్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇక్కడ అణగదొక్కడానికి కొంత మంది ఉంటారని ఒకింత ఆవేదనతోనే చెప్పింది.
Also read: Nagarjuna: నాగార్జున అందానికి ఆ జపనీస్ వంటకమే కారణమా! ఎలా బయటకొచ్చింది
అయితే సౌత్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రియాంక మోహన్ పై నెగిటివ్ ప్రచారం వెనక చెన్నైకి చెందిన ఓ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఆ కంపెనీ నుంచి ప్రియాంక బయటకి వచ్చాకే తనపై ట్రోల్స్ జరుగుతున్నాయనేది వాళ్ళ నమ్మకం. దక్షిణాది చిత్ర పరిశ్రమకి చెందిన అనేక మంది తారల మీడియా వ్యవహారాలని ఆ కంపెనీ చూస్తుంటుంది. గత కొన్ని నెలల నంచి మాత్రం ప్రియాంక పై నెగిటివ్ పోస్టులు, దారుణమైన కామెంట్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత కెరీర్ చూసుకుంటే 'మేడ్ ఇన్ కొరియా'(Made In Korea) అనే తమిళ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా రేపు స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ్ లో మరో సినిమా, కన్నడలో ఒకటి ఆమె ఖాతాలో ఉన్నాయి 2019 లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడలో పదమూడు చిత్రాల వరకే చేసింది.







